Download Pattadar Passbook: ధరణి పోర్టల్‌లో పట్టాదారు పాస్​బుక్​ డౌన్​లోడ్​ చేసుకోవడం ఎలా..?

0
71
Download Pattadar Passbook in Telangana Dharani Portal
Download Pattadar Passbook in Telangana Dharani Portal

Download Pattadar Passbook in Dharani Portal: తెలంగాణలో ఆస్తి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా మారింది. డిజిటల్‌గా ల్యాండ్ రికార్డులను తీసుకురావడంతో కొద్దిపాటు పారదర్శకత పెరిగింది.

(ఇది కూడా చదవండి: Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవడం ఎలా..?)

ధరణి పోర్టల్ తీసుకొని వచ్చిన తర్వాత ల్యాండ్‌ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ ఇప్పుడు గంటల్లో జరిగిపోతుంది. పాత ఓనర్ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేసి, కొనుగోలుదారునికి కొత్త పాస్ బుక్ అందిస్తున్నారు. అంతకుముందు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కోసం వారాల తరబడి సమయం పట్టేది. అయితే, ఈ ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్​బుక్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా?. ఎలా మీ పాస్ బుక్ డౌన్​లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ధరణి పోర్టల్‌లో పట్టాదారు పాస్​బుక్​ డౌన్​లోడ్​ చేసుకోవడం ఎలా..?

  • ముందుగా ధరణి పోర్టల్​ అధికారిక వెబ్​సైట్​ https://dharani.telangana.gov.inను ఓపెన్​ చేయాలి.
  • స్క్రీన్​ మీద ఉన్న Agriculture ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత (IM 1)Land Detail Searchను ఎంపిక చేసుకోవాలి.
  • ఇప్పుడు Click Here to Continueపై క్లిక్​ చేసి పట్టాదారు పాస్​బుక్​ నెంబర్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత మీ పట్టాదార్​ పాస్​బుక్​ నెంబర్​, Captcha Code ఎంటర్​ చేసి Fetch బటన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు స్క్రీన్​ మీద పాస్​బుక్​ వస్తుంది.. దానిని డౌన్​లోడ్​ చేసుకుని సేవ్​ చేసుకోండి.

ధరణి పోర్టల్‌లో మీ భూమి వివరాలు తెలుసుకోండి ఇలా..?

  • ముందుగా ధరణి పోర్టల్​ అధికారిక వెబ్​సైట్​ https://dharani.telangana.gov.inను ఓపెన్​ చేయండి.
  • ఇప్పుడు స్క్రీన్​ మీద కనిపించే Agriculture ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత (IM 1) Land Detail Searchను ఎంపిక చేసుకొని Click Here to Continueపై క్లిక్​ చేయాలి.
  • అనంతరం సర్వే నెంబర్​ ఆప్షన్​పై క్లిక్​ చేసి మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్​, Captcha ఎంటర్​ చేసిన Fetch ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు స్క్రీన్​పై మీ భూమికి సంబంధించిన అన్నీ వివరాలు కనిపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here