Dharani Portal Login
Dharani Portal Login

తెలంగాణ ప్రభుత్వం 2020లో భూ లావాదేవీల కోసం ‘ధరణి’ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఈ పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ధరణి పోర్టల్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

భూమికి సంబంధించిన అన్ని పనులను విజయవంతంగా నిర్వహించడానికి ఇది ఒక ప్రామాణికమైన సింగిల్ విండో పొరట్ల. భూ సంబందిత లావాదేవీల కోసం, ఇతర సేవల కోసం మనం తప్పనిసరిగా ధరణి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, మనం ఇప్పుడు ధరణి వెబ్‌సైట్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకుందాం.

ధరణి తెలంగాణ వెబ్‌సైట్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి?

 • dharani.telangana.gov.in/లో తెలంగాణ ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్‌ని ఓపెన్ చేయండి.
 • ఇప్పుడు Slot booking for Citizens అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
 • మీకు ఇప్పుడు కుడి భాగంలో కనిపించే Sign UP Here అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
 • మీ స్క్రీన్‌పై కొత్త విండో పాపప్ అవుతుంది.
 • ఈ పేజీలో మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను పూరించాలి.
 • ఆ తర్వాత Validate & Registerపై క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది.

ధరణి వెబ్‌సైట్‌లో ఎలా లాగిన్ అవ్వాలి?

 • dharani.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
 • ఇప్పుడు Slot booking for Citizens అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
 • ఆ తర్వాత ‘యూజర్ మొబైల్ నెంబర్, ‘యూజర్ పాస్‌వర్డ్’ వంటి వివరాలను నమోదు చేయండి.
 • చివరగా, వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
 • ఆ తర్వాత మీరు ధరణి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతారు.

(ఇది కూడా చదవండి: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)