Thursday, April 25, 2024
HomeTechnologyMobilesపవర్ బ్యాంక్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

పవర్ బ్యాంక్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

ఈ రోజు చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద బ్యాటరీ సామర్థ్యాలను కలిగిఉంటున్నాయి మరియు కొన్ని సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్స్ వాటితో పోలిస్తే ఇప్పుడు వచ్చే వాటిలో ఎక్కువ శక్తి సామర్థ్య చిప్‌సెట్లను కలిగి ఉన్నాయి. అదే సమయంలో, వినియోగదారుల కోరిక మేరకు చాలా కంపెనీలు భారీ సామర్ధ్యమున్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీలను తీసుకొస్తున్నాయి. పవర్ బ్యాంకునే పోర్టబుల్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం భాగా పెరిగిన నేపథ్యంలో తొందరగా మన బ్యాటరీ అనేది అయిపోతుంది. ముఖ్యంగా ఎక్కువగా జర్నీ చేసేవాళ్లు తప్పనిసరిగా బ్యాటరీ సమస్య వీరిని భాగా ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే వీరు తమ వేంట తప్పనిసరిగా పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్తుంటారు. ఇలా మనం పవర్ బ్యాంక్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 

  • చాలా వరకు కంపెనీలు భారీ సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనుగోలు చేయమని సలహాలు ఇస్తుంటాయి. అయితే, మనం వారి మార్కెట్ బుట్టలో పడవద్దు. మన వాడే మొబైలును బట్టి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలి. ఉదా: నా ఫోన్ యొక్క బ్యాటరీ సామర్ధ్యం అనేది 4000 mAh అనుకుంటే నాకు 10,000 mAh సామర్ధ్యం గల పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోతుంది. 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు వచ్చే ఔట్‌పుట్ సుమారు 8,000ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్ పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి.
  • మీరు పెద్ద సామర్ధ్యం ఉన్నా పవర్ బ్యాంక్ లు కొనే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అధిక సామర్థ్యం గల పవర్ బ్యాంకుల తీసుకునేటప్పుడు కొలతలు, బరువు మరియు ఆకారం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి.
  • మీ పవర్ బ్యాంక్ లు కొత్తగా తీసుకున్నపుడు 75 నుండి 85 శాతం వరకు ఔట్ పుట్ ని అందిస్తాయి. దీని అర్దం 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు వచ్చే ఔట్‌పుట్ సుమారు 8,000ఎంఏహెచ్ వరకు వస్తుంది అన్నమాట. మీరు ఉపయోగిస్తున్న ఛార్జింగ్ కేబుల్ లేదా ఛార్జ్ చేయడానికి మీరు ఉపయోగించే ఛార్జర్ యొక్క రేటింగ్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి.
  • పవర్ బ్యాంక్ కొనేముందు స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి. ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు… పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి.
  • ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది.
  • ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే.
  • ఇంకా మనం పవర్ బ్యాంక్ లను కొనే ముందు బ్రాండెడ్ గల కంపెనీలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే అవి ఛార్జ్ సమయం, బ్యాటరీ మన్నిక, ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు, ఛార్జ్ మార్పిడి సామర్థ్యం, బిల్డ్ క్వాలిటీ వంటి విషయాలలో కొంచెం నాణ్యతను పాటిస్తాయి. నకిలీ కంపెనీల నుండి అసలు తీసుకోకుంటే మంచిది.
  • మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది. ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల లైఫ్ ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే.

Some Recommendations:

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles