ఇప్పటికే వివిద దేశాల్లో పలు రకాల వివాదాలతో సతమతమవుతున్న ఫేస్‌బుక్ సంస్థకి ఈ ఏడాది(2021) అంతగా కలిసిరావడం లేదని చెప్పుకోవాలి. తాజాగా ఫేస్‌బుక్ చెందిన దాదాపు 50కోట్ల మంది వినియోగదారులకు చెందిన మొబైల్ ఫోన్ నంబర్ల డేటాను టెలిగ్రామ్ బాట్ ద్వారా ఒక సైబర్‌ క్రిమినల్‌ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని మదర్‌బోర్డ్ నివేదిక తెలిపింది. ఈ డేటాలో 6 లక్షల మంది భారతీయ వినియోగదారులు ఉన్నారు. సైబర్‌ క్రిమినల్‌ సంస్థ సేకరించిన డేటాబేస్‌లో 2019 వరకు యూజర్ల డేటా ఉంది.(ఇంకా చదవండి: ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?)

మొదట దీనిని భద్రతా పరిశోధకుడు అలోన్ గాల్ ట్విట్టర్ ఖాతాలో హైలైట్ చేశారు. అలోన్ గాల్ తెలిపిన వివరాల ప్రకారం టెలిగ్రామ్‌ బోట్‌ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిసింది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌ షాట్లను కూడా ఆయన షేర్‌ చేశారు. ముఖ్యంగా ఇలాంటి మొబైల్ ఫోన్ నంబర్లకు సంబంధించి ఒక సమస్య బయటపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అసురక్షిత సర్వర్‌లో ఉన్న దాదాపు 40కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లు 2019లో లీక్ అయ్యాయి. 2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్‌ గురించి తొలిసారి తెలిసంది.

అయితే, ప్రతి సంవత్సరం ఎక్కువ శాతం ప్రజలు ఫోన్ నంబర్లను అప్‌డేట్ చేయనందున ప్రస్తుతం బయట అమ్మబడుతున్న సమాచారం ఖచ్చితమైనది. 100కి పైగా దేశాల వినియోగదారులు ప్రభావితమయ్యారని భద్రతా పరిశోధకుడు నివేదించారు. భారతదేశంలో 6,162,450 మంది వినియోగదారులు దీనిపై ప్రభావం ఉందని చెప్పారు. మదర్బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ శాతం మంది తమ మొబైల్ నెంబర్ ని ఫేస్‌బుక్ లింకు చేస్తారు, అప్పుడు హ్యకర్లు టెలిగ్రామ్ బోట్ సహాయంతో ఆ నెంబర్ తో గల సులభంగా ఫేస్బుక్ యూజర్-ఐడిని కనుగొనవచ్చు.(ఇంకా చదవండి: జూన్ నుంచి జీ -మెయిల్ ఖాతాలను తొలగించనున్న గూగుల్?)

ఒక్క యూజర్ సమాచార‌ వివరాలు కావాలంటే 20(రూ.1,460) డాలర్లు, అదే పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు(రూ.3,64,975) వసూలు చేస్తోందని నివేదిక పేర్కొంది. ఇప్పటికైనా ఫేస్‌బుక్‌ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే యూజర్లు కూడా మీ వ్యక్తిగత ఖాతాలకు ఫోన్ నెంబర్ లను జత చేయవద్దని నిపుణులు కోరుతున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here