టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ 180 బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. అయితే తాజాగా ఎలోన్ మస్క్ ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైన ట్వీట్ పెట్టాడు. ఎవరైతే ఉత్తమ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని కనుగొంటారో వారికి 100 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం దీనికి సంబందించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. అందువల్ల ఈ పోటీ ఎలా ఉంటుంది అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.(ఇంకా చదవండి: జపాన్ కి పోటీగా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టిన చైనా!)
ప్రస్తుతం గ్రీన్ హౌస్ గ్యాస్ ద్వారా భూమీ విపరీతంగా వేడెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై పర్యావరణ ప్రేమికులు చాలా ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూమీ వేడెక్కడానికి ప్రధాన కారణమైన కర్బన ఉద్గారాలను సంగ్రహించడం అనేది చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు కూడా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ పురోగతి సాధించబడింది.
గాలి నుండి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దేశాలలో కర్బన ఉద్గారల శాతం సున్నకి చేరుకోవాలంటే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ పరిజ్ఞానంను వీలైనంత త్వరగా కనిపెట్టాలని అంతర్జాతీయ శక్తి సంస్థ(International Energy Agency) గత ఏడాది చివర్లో తెలిపింది.
కార్బన్ సీక్వెస్ట్రేషన్(Sequestration) అంటే ఏమిటి?
కార్బన్ డయాక్సైడ్ అనే గ్రీన్ హౌస్ వాయువు ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. కార్బన్ సీక్వెస్ట్రేషన్(Carbon Sequestration) అనేది వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను సంగ్రహించి నిల్వ చేసే ప్రక్రియ. ప్రపంచ వాతావరణంలో సంభవించే మార్పులను తగ్గించే లక్ష్యంతో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని తగ్గించడానికి ఇది ఒక పద్ధతి.(ఇంకా చదవండి: వాట్సాప్‌లో ఈ మెసేజ్ లతో జర జాగ్రత్త!)
విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను భాగం మండిచడం, సిమెంట్ ఉత్పత్తి వంటి పారిశ్రామిక ప్రక్రియల ద్వారా కార్బన్ డయాక్సైడ్ లేదా CO2 అధిక మొత్తంలో విడుదల అవుతుంది. అయితే ఈ కర్బన ఉద్గారలను వివిధ పద్ధతుల ద్వారా కార్బన్‌ను సంగ్రహించవచ్చు. వాటిలో ప్రధానమైనవి పోస్ట్-దహన(Post Combustion), పూర్వ దహన(Pre-Combustion), ఆక్సిఫ్యూయల్ పద్ధతులు. Post Combustion టెక్నాలజీ సహాయంతో శిలాజ ఇంధనాలను కాల్చడం వలన వచ్చే ఫ్లూ వాయువుల నుండి CO2ను తొలగించవచ్చు. అదే Pre-Combustion పద్దతిలో శిలాజ ఇందనాలను కాల్చడానికి ముందు ఇంధనాన్ని హైడ్రోజన్, CO2 మిశ్రమంగా మారుస్తారు దీని వల్ల కొంత మొత్తంలో కర్బన ఉద్గారల శాతాన్ని తగ్గించవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.