దేశీయ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. దాదాపు 25 లక్షల మంది ఎయిర్‌టెల్ యూజర్ల డేటా హ్యాకర్ల చేతిల్లోకి వెళ్లిపోయింది. దీంతో చాలా మంది యూజర్లు ఆందోళన చెందుతున్నారు. లీకైన డేటాలో 25 లక్షల మందికి చెందిన చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లు హ్యాకర్ల చేతిల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఈ డేటాను హ్యాకర్లు అమ్మాలని చూస్తున్నారని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా పేర్కొన్నారు.(ఇది చదవండి: ఐటీ దిగ్గజ కంపెనీలను, అమెరికాను వణికించిన అతిపెద్ద హ్యాకర్ ఎవరో తెలుసా?)

హ్యాకర్లు ఎయిర్‌టెల్ భద్రతా బృందాలతో మాట్లాడి తమకు 3500 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను ఇవ్వాలని వారి మీద ఒత్తిడి చేశారు. ఒకవేల ఇవ్వకపోతే 25 లక్షల మంది యూజర్ల డేటాను ఇంటర్నెట్ లో బహిర్గతం చేస్తామని వాళ్లని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఎయిర్‌టెల్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో విసుగు చెందిన తర్వాత ఒక వెబ్‌సైట్‌ను సృష్టించి ఎయిర్‌టెల్ యూజర్ల డేటాను బయటకి లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ అందుబాటులో లేదు. ఎయిర్‌టెల్ సిస్టమ్స్ లేదా సర్వర్‌ల నుండి డేటా లీక్ కాలేదని తెలుస్తుంది. భద్రతా అవసరాల కోసం కొన్ని టెలికం డేటాను యాక్సెస్ చేసే ప్రభుత్వ సంస్థల నుంచి ఇది లీక్ అయినట్లు సమాచారం.((ఇది చదవండి: తెలంగాణ రేషన్ ‌కార్డుదారులకు తపాలాశాఖ శుభవార్త!)

బయటకి లీకైనా డేటలో చాలా వరకు జమ్ము & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన యూజర్ల డేటా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మొదటగా దీనిని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా గుర్తించారు. రాజాహారియా ప్రకారం, “హ్యాకర్లు 2021 జనవరిలో 25 లక్షల ఎయిర్‌టెల్ చందాదారుల వివరాలను బయటకి విడుదల చేశారు. ఎయిర్‌టెల్ సంస్థ నుంచి డబ్బును దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆధార్ నెంబర్ తో సహ మొత్తం యూజర్ డేటాను అమ్మకానికి పెట్టారు. డార్క్ వెబ్‌లో మాత్రం కాదు” అని ఆయన అన్నారు.

అయితే ఈ విషయంపై ఎయిర్‌టెల్ స్పందించింది. “ఎయిర్‌టెల్ తన యూజర్ల డేటాను కాపాడటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటుంది. ఆ డేటా మా వైపు నుంచి బయటకి రాలేదు, విడుదలైన డేటా రికార్డులలో ఎక్కువ భాగం ఎయిర్‌టెల్‌కు చెందినవి కావు. మేము ఇప్పటికే ఈ విషయం గురుంచి సంబంధిత అధికారులకు తెలియజేసాము” అని ఎయిర్‌టెల్ తెలిపింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here