మనలోని చాలా మంది తమ కృషి, పట్టుదలతో అగ్రస్థానాలను అధిరోహిస్తారు. వారికి కూడా ప్రారంభ దశలో ఇతరుల నుంచి ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటారు. కానీ వారు అవేమీ పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అలాంటి వారికి సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజాయితీగా కష్టపడేతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే అలవాటు ఉన్నవారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కోటీశ్వరులవుతారు. అలాంటి వారిలో కొందరు మాత్రం తాము వచ్చిన దారిని ఎన్నటికీ మర్చిపోరు. (ఇది చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో మైక్ కి ఏదైన అడ్డుపెడితే ఏం జరుగుతుందో తెలుసా?)

వారు వచ్చిన బాటలో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం తాము సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి కూడా వెనకాడని వారు ఉంటారు. అయితే వారు సంపాదించిన ఆస్తి సమాజాసేవకే తప్ప వారసులకు కాదు అని భావిస్తారు. కానీ అలాంటి మనసున్న మహారాజులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి. మన దేశంలో టాటా గ్రూప్ చైర్మెన్ రతన్ టాటా, విప్రో చైర్మెన్ అజీం ప్రేమ్‌ జీ వంటి వారు ఈ వరుసలో ముందుంటారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరో దక్షిణ కొరియా బిలియనీర్ వచ్చి‌ చేరారు.

దక్షిణ కొరియా చెందిన సంపన్న వ్యక్తులలో ఒకరైన, దేశంలోని అతిపెద్ద మొబైల్ మెసెంజర్ యాప్ కాకావోటాక్ వ్యవస్థాపకుడు కిమ్‌ బీమ్‌ సు తన సంపదలో సగానికి పైగా సమాజానికి తిరిగిచ్చేస్తానని ప్రకటించారు. 9.4 బిలియన్ డాలర్ల ఆస్తి గల కిమ్-బీమ్-సు “సామాజిక సమస్యలను పరిష్కరించడానికి నా ఆస్తిలో సగం కంటే ఎక్కువ రూ.40వేల కోట్లను విరాళంగా ఇస్తాను” అని కిమ్ కాకావో ఉద్యోగులందరికీ పంపిన సందేశంలో పేర్కొన్నారు.(ఇది చదవండి: పీఎం కిసాన్ రైతుల కోసం మరో పథకం.. ప్రతి నెల ఖాతాలోకి రూ.3వేలు?)

2010లో కకావో మొబైల్ యాప్ ను కిమ్‌ బీమ్‌ సు ప్రారంభించారు. దీనిలో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల రోజు రోజుకి వినియోగదారులు పెరగిపోతున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని 90 శాతం మంది యూజర్లు ఫోన్‌లలో దీనిని వాడుతున్నారు. గత సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కకావో మొబైల్ యాప్ వాడకం పెరగడం వల్ల ఫోర్బ్స్‌ ప్రకారం కిమ్‌ దేశంలోనే అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.

కరోనా సమయంలో ప్రపంచ బిలియనర్లు బిల్ & మెలిండా గేట్స్, వారెన్ బఫ్ఫెట్ పిలుపునిచ్చిన ‘గివింగ్‌ ప్లెడ్జ్’‌కి చాలా మంది విరాళాలు అందించారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది సంపన్నులు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినట్లు గివింగ్‌ ప్లెడ్జ్‌ వెబ్‌సైట్ తెలిపింది. జపాన్, దక్షిణ కొరియా నుంచి ఇంత వరకు ఎవరూ లేరు. కిమ్‌ బీమ్‌ సు ప్రకటనతో ఈ జాబితాలో చేరిన తొలి దక్షిణా కొరియా దేశస్తుడిగా నిలిచారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.