ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అనేది మరోక ప్రపంచం అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల చిన్న విషయం జరిగిన మనకు ఇంటర్నెట్ ద్వారా చిటికలో తెలిసిపోతుంది. సినిమాలు చూడడానికి, న్యూస్ తెలుసుకోవడానికి, బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవడానికి ఇలా ఒకటేంటి కొన్ని వేల పనులు ఇంటర్నెట్ ద్వారా క్షణాలలో జరిగిపోతున్నాయి. అయితే ఇంటర్నెట్ అనేది పట్టణ ప్రాంతాలలో బాగుటుంది కానీ గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది.(ఇది చదవండి: భవిష్యత్ లో ప్రపంచంలో రాబోయే భారీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇదే!)
ఇంకా అడవులు, ఎడారి ప్రాంతాలలో నివసించే ప్రజలకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి తక్కువ ధరకే ఇంటర్ నెట్ ను అందించాలనే ఉద్దేశంతో స్పేస్ ఎక్స్ స్టార్ లింకు అనే ఒక ప్రాజెక్టును మొదలు పెట్టింది. స్టార్ లింకు అనే ప్రాజెక్టు పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ తెలుసుకుందాం.

ఇంటర్నెట్ ను ప్రధానంగా మూడు రకాలు:
మొదటిది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్
రెండవది మొబైల్ సెల్యులార్ ఇంటర్ నెట్
మూడవది శాటిలైట్ ఇంటర్నెట్
ఇందులో ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగించేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇంటర్నెట్, మొబైల్ సెల్యులార్ ఇంటర్ నెట్. ఈ రెండింటితో పోలిస్తే ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ చాలా తక్కువగా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ అనేది చాలా వేగంగా వచ్చినప్పటికీ అది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఫైబర్ కేబుల్ నెట్ తో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా భూమీపై ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటర్నెట్ అందించవచ్చు. అందుకోసమే స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా భూమిపై ఉన్న అన్నీ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించాలని నిర్ణయించుకుంది.(ఇది చదవండి: ప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. ఇది పది కాళేశ్వరాలతో సమానం!)
2015లో ప్రారంభం
2015లో ఎలోన్ మస్క్ స్టార్ లింకు అనే పేరుతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. The Fault in Our Stars పుస్తకం ఆధారంగా ఈ పేరును ప్రాజెక్టుకి పెట్టారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ భాద్యతలను ఏలోన్ మస్క్ సీఈఓగా ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 30 వేల నుంచి 42 వేల సాటిలైట్ లను దశల వారీగా అంతరిక్షంలోకి పంపి భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగంతో ఇంటర్ నెట్ ను అందించడానికి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు ఏలోన్ మస్క్ ప్రకటించారు.
పెడల్ కమ్యూనికేషన్ కమిషన్ నుంచి స్పేస్ ఎక్స్ కు సంబందించిన 12,000 శాటిలైట్స్ కి 2017లో అనుమతి లభించింది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 10 సంవత్సరాలలో పూర్తి చేయాలని ఎఫ్ సీసీ నిబందన పెట్టింది. స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్టు కోసం 10 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కూడా సిద్ధం చేసుకుంది. అయితే భవిష్యత్ లో ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ మూడు రకాల ఫ్రీక్వెన్సీ ఆధారంగా సాటిలైట్స్ ను తయారు చేస్తుంది. 1) Ku-Band ,2) Ka-Band, 3) V-Band.

Ku-Band శాటిలైట్స్ 12 నుంచి 18 GHz ఫ్రీక్వెన్సీ విడుదల చేస్తాయి. Ka-Band శాటిలైట్స్ 26.5 నుంచి 40 GHz ఫ్రీక్వెన్సీ, V-band శాటిలైట్స్ 40 నుంచి 75 GHz ఫ్రీక్వెన్సీ విడుదల చేస్తాయి. ఇలా 7518 V-band, 1584 Ka-band, 2824 Ku-band శాటిలైట్స్ ను అంతరిక్షంలో ప్రవేశ పెట్టాలని చూస్తుంది. అయితే ఈ మూడు రకాల శాటిలైట్ లు అంతరిక్షంలో మూడు కక్ష్యలలో ప్రవేశ పెట్టనుంది. భూమికి 335 నుంచి 345 కిమీ ఎత్తులో 7518 V-Band శాటిలైట్స్, 550 కిలోమీటర్ల ఎత్తులో 1584 Ka-band శాటిలైట్స్, 1100 నుంచి 1325 కిమీ ఎత్తులోKu-Band 2824 శాటిలైట్స్ తిరుగుతాయి. స్పేస్ ఎక్స్ ఇప్పటికే అంతరిక్షంలోకి శాటిలైట్స్ ను ప్రవేశ పెట్టడం మొదలు పెట్టింది.(ఇది చదవండి: ఎలన్ మస్క్(సిగ్నల్), మార్క్ జూకర్‌బర్గ్ (వాట్సాప్) మధ్య ఘర్షణకు కారణం ఏమిటి?)
2018 ఫిబ్రవరి 22న మొట్ట మొదటి సారిగా 2 శాటిలైట్ లను అంతరిక్షంలోకి పంపించింది. మే 24న ఫాల్కన్ అనే రాకెట్ ద్వారా ఒకేసారి 60 శాటిలైట్స్ అంతరిక్షంలోకి పంపించింది. అలాగే మళ్లీ 2019 నవంబర్ 11న మరొక బ్యాచ్ లో 60 శాటిలైట్స్ ని పంపింది. ఇలా 2020 జనవరి 29 నుంచి 2021 ఫిబ్రవరి 4 వరకు రెండు వారాలకు ఒకసారి 60 సాటిలైట్స్ కక్ష్యలో ప్రవేశపెడతుంది. ఇవన్నీ భూమికి 500 కి.మీ ఎత్తులో ఒక క్రమ పద్దతిలో తిరుగుతున్నాయి. అయితే వీటిలో కొన్ని శాటిలైట్స్ ఇప్పటికే పని చేయడం మొదలు పెట్టాయి.

ప్రతి శాటిలైట్ లో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి. సిగ్నల్ కోసం యాంటీనా, ఎనర్జీ కోసం సోలార్ పానెల్స్, శాటిలైట్స్ తిరగడానికి ప్రోపల్షన్ ఉంది. ఈ శాటిలైట్స్ 227 – 260 కేజీల బరువును కలిగి ఉన్నాయి. ఈ శాటిలైట్స్ అంతరిక్షంలో కొన్ని వేల వరకు ఉంటాయి కాబట్టి వీటి వల్ల భూమిపై నుంచి అంతరిక్షాన్ని పరిశీలించే లేబరేటరీస్ కి ఇబ్బంది కలగకూడదు అని శాటిలైట్ లకి డార్క్ కోటింగ్ వేశారు. డార్క్ కోటింగ్ వల్ల కాంతిని సాటిలైట్స్ గ్రహించుకోవడంతో లైట్ రిఫ్లెక్షన్ తక్కువగా వస్తుంది. దీనివల్ల అంతరిక్షాన్ని పరిశీలించే వారికి ఎటువంటి ఆటంకం కలుగదు.
అయితే FCC నిబందనల ప్రకారం 12 వేల శాటిలైట్స్ ని ఇచ్చిన టైం ప్రకారం 2027 కల్లా అంతరిక్షంలో ప్రవేశ పెట్టాలి. అందుకోసమే స్పేస్ ఎక్స్ ప్రతి రోజు రెండు నుంచి మూడు ఉపగ్రహాలను చాలా తక్కువ ధరకే తయారు చేస్తుంది. అలాగే రెండు వారాలకు ఒకసారి 60 చొప్పున వీటిని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెడుతుంది.(ఇది చదవండి: విజయ్ మాల్య వంటి ఆర్దిక నేరగాళ్లు బ్రిటన్ కు ఎందుకు పారిపోతున్నారు?)

అయితే స్టార్ లింకు శాటిలైట్ ఇంటర్నెట్ అనేది నేరుగా మన ఫోన్ లోకి రాదు ఇందుకోసం మన ఇళ్ల మీద ప్రస్తుతం ఉన్న డిటిహెచ్ లాంటి టెర్మినల్స్ పెట్టుకోవాలి. ఈ టెర్మినల్స్ ని ఇంటి మీద, పని చేసే ప్రదేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ టెర్మినల్స్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్టార్ లింకు రూటర్ కి ఇంటర్ నెట్ వస్తుంది. ఈ టెర్మినల్స్ అంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే 2019లో యుఎస్ ఎయిర్ఫోర్స్ వారు స్టార్ లింకు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ పరీక్షించడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి స్టార్ లింకు రిసీవర్ అమర్చి పరీక్షించారు. ఈ పరీక్షలో 600 ఎంబీపీస్ స్పీడ్ వేగం వచ్చింది.
అన్నిటికంటే మనకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న వీటి వల్ల అంతరిక్షంలో ఏదైనా ప్రమాదం జరగదా అని? అవును మీరు అనుకునేట్లు కచ్చితంగా జరుగుతుంది. అంతరిక్షంలో ఉండే చిన్న వస్తువు వల్ల పెద్ద పెద్ద శాటిలైట్ లకు ప్రమాదం జరగుతుంది. దీనికోసం కూడా స్పేస్ ఎక్స్ ఒక ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం స్టార్ లింకు శాటిలైట్ లు భూమి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో 300 నుంచి 1300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతాయి. అయితే ప్రస్తుతం అంతరిక్షంలో తీరుగుతున్న కమ్యూనికేషన్స్ ఉపగ్రహాలు అన్నీ భూమీ నుంచి 35వేల కి.మీ ఎత్తులో తిరుగుతాయి.
అయితే ప్రతి స్టార్ లింకు శాటిలైట్ జీవిత కాలం 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీటి జీవితం కాలం అయిపోగానే అవి ప్రొపల్షన్ సహాయంతో భూమీ వైపు ప్రయాణిస్తాయి. అయితే వీటిని మార్గం మధ్యలోనే పూర్తిగా దహనం అయ్యేలా స్పేస్ ఎక్స్ రూపొందించింది. అందువల్ల ఇతర ఉపగ్రహాలకు ఎటువంటి ఆటంకం కలుగదు.(ఇది చదవండి: ప్రపంచంలో ఖరీదైన కంప్యూటర్ ధర ఎంతో తెలుసా?)

2025 చివరి నాటికి ప్రతి ప్రాంతానికి దీని ద్వారా ఇంటర్నెట్ అందించాలని ఏలోన్ మస్క్ చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, కెనడా లాంటి ప్రాంతాలలో దీని ద్వారా వాణిజ్య పరంగా ఇంటర్నెట్ అందిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 1gbps ఇంటర్నెట్ కు 100 డాలర్లు వసూలు చేస్తున్నారు. అలాగే కనెక్షన్ తీసుకునే సమయంలో స్టార్ లింకు పరికరాల కోసం 500 డాలర్లు, ఎక్కడికైనా మారినప్పుడు షిప్పింగ్ ఛార్జీల కింద 50 డాలర్లు తీసుకుంటున్నారు. భవిష్యత్ లో ఈ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది.
రాబోయే 5G, 6G టెక్నాలజీ అనేది స్టార్ లింకుకు ఒక పెద్ద సమస్యగా మారనుంది. అలాగే దీనికి పోటీగా ఇంగ్లండ్, మనదేశానికి చెందిన ఎయిర్ టెల్ వన్ వెబ్, అమెజాన్ అధిపతి జెఫ్ బిజోస్ తన కైపర్ ప్రాజెక్టు ద్వారా శాటిలైట్ అందించాలని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్నిటికంటే ముందు వరుసలో స్టార్ లింకు ఉంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.