Drone Attacked by Raven Mid Air

టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇవ్వాళ ఉన్న టెక్నాలజీ కంటే మెరుగైన టెక్నాలజీ వస్తుంది. ఇప్పటి చాలా నగరాల్లో ఫుడ్ డెలివరీని బైక్స్ మీద చేస్తుంటే. అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ది చెందిన దేశాలలో ప్రైవేట్ కంపెనీలు డ్రోన్ ద్వారా ఆహారాన్ని డెలివరీ చేస్తున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగిన సమస్యలు మాత్రం వీడటం లేదు. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వెళుతున్న ఓ డ్రోన్‌పై కాకి దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

బెన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ వీడియోను తీశారు. బెన్‌ రాబర్ట్స్ ఆహారం కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి డెలివరీ కోసం చూస్తున్నాడు. డ్రోన్ ద్వారా ఆ కంపెనీ ఫుడ్ డెలివరీ చేస్తుంది. అయితే, సరిగ్గా తన ఇంటి దగ్గరకి వచ్చిన వెంటనే ఒక కాకి డ్రోన్‌ను వెంబడించింది. డ్రోన్‌పై ముక్కుతో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత డ్రోన్ ఆహారాన్ని అక్కడే జారవిడిచి వెళ్ళిపోయింది. ఆ మొత్తాన్ని రాబర్ట్స్ వీడియో తీసి తన యూట్యూబ్ చానెల్లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం భాదతో “చివరకు మానవులు పక్షులను ఈ విధంగా ఇబ్బంది పడతారు.. పక్షులకు ఎగరడానికి స్థలం ఇవ్వడం లేదు” అని కామెంట్ చేశాడు.