విడాకుల ప్రకటన తర్వాత మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌పై అనేక సంచలన ఆరోపణలు బయటకి వస్తున్నాయి. తాజాగా బిల్‌గేట్స్‌ వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాడు జేమ్స్‌ వాల్లేస్‌. ఇప్పటికే వాల్లేస్‌.. గేట్స్‌ మీద రెండు బయోగ్రఫీలు కూడా రాశాడు. ఆ బయోగ్రఫీలో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్‌ తొలినాళ్లలో గేట్స్‌ విపరీతంగా పార్టీలు నిర్వహించి ఆ పార్టీకి అనేక మంది అమ్మాయిలను పిలిపించుకునేవాడు అని వాల్లేస్‌ పేర్కొన్నాడు. గేట్స్‌ ఆ అమ్మాయిలతో నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. తప్పతాగి వాళ్ల చుట్టూ తిరుగుతూ.. జల్సాలు చేసేవాడని ఆయన ఆరోపించాడు.

కొమ్‌డెక్స్‌, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్‌.. ఇటువంటి పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ సమయంలో బిల్‌గేట్స్‌ తాగుడి గురుంచి గతంలో రాబర్ట్‌ క్రింగ్లే అనే బ్లాగర్‌ రాసిన ఒక కథనాన్ని వాల్లేస్‌ ప్రస్తావించాడు. అయితే, ఈ ప్రకటనలపై.. బిల్‌ గేట్స్‌ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు ఎక్కువగా వెలువడడం దారుణమని ఆక్షేపించారు. ఇక బిల్‌గేట్స్‌(65)పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు చేశారు. ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్‌తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.