మీకు ఉన్న రెండూ, మూడు ఎకరాల భూమిలో మీకు కేజీల బంగారం, ప్లాటినమో దొరికితే చాలు ఇక మీరు కోటీశ్వర్లు అయినట్లు అందరూ భావిస్తారు. అలాంటిది మరి అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’(Psyche Asteroid) అనే ఒక గ్రహశకలాన్ని భూమికి తెస్తే చాలు మనకు ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా.. 72 లక్షల కోట్ల కోట్లు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో కనీసం రూ.9 వేల కోట్లు రూపాయలు జమ చేయవచ్చు. ఆ గ్రహ శకలాన్ని భూమి తీసుకొనిరావడానికి శాస్త్రవేత్తలు ప్లాన్‌ చేస్తున్నారు. మరి సైకీ గురుంచి పూర్తిగా తెలుసుకుందామా?

సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఒక ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ ఉంది. ఇతర గ్రహాల మాదిరాగానే అక్కడి కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ఉన్నదే ఈ సైకీ ఉపగ్రహం. మామూలుగా ఆస్టరాయిడ్లు అంటే కొన్ని మీటర్ల నుంచి ఐదో, పదో కిలోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కానీ సైకీ గ్రహశకలం మాత్రం చాలా భారీగా ఉంది. దీని వ్యాసం రెండు వందల కిలోమీటర్లు వరకు ఉండవచ్చు. అంటే మన చందమామ పరిమాణంలో సుమారు 15వ వంతు వరకు ఉంటుంది. భూమికి సైకీకి మధ్య దూరం సుమారు 37 కోట్ల కిలోమీటర్లు.

‘సైకీ’ అంటే దేవత

ఇటలీకి చెందిన అన్నిబేల్‌ గస్పారిస్‌ అనే అంతరిక్ష పరిశోధకుడు 1852లోనే ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దీనికి పెట్టారు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ గ్రహ శకలం మీద పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి ఒక వ్యోమనౌకను పంపాలని ప్రయత్నిస్తుంది. సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కప్పబడి ఉంటాయి. ముఖ్యంగా చాలా వరకు గ్రహాల మీద సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి.

కానీ, ‘సైకీ’ ఆస్టరాయిడ్‌(Psyche Asteroid) మాత్రం చాలా వరకు విలువైన లోహాలతో కూడి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన ఖరీదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్‌ చాలా భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేథరిన్‌ డిక్లీర్‌ చెప్పారు. దానిపై ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్కిన్స్‌ టాంటన్‌ అంచనా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here