చాలా మంది తమకు ఇష్టమైన వాహనం కొన్నాకా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ పెట్టించుకోవాలని కోరుకుంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వాహన దారులు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత డబ్బు అయిన చెల్లిస్తారు. మన దేశంలో వేలంపాటలో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం ఒక్కోసారి లక్షలు పోసిన హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హై ఎండ్ కార్లు కొన్నవాళ్లు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కొనుక్కోవడం చేస్తారు.(ఇది కూడా చదవండి: జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్)
ఇప్పుడు మనం చెప్పు కోబోయే కారు ఖరీదు కంటే నెంబర్ ఖరీదు రెండింతలుగా ఉంది. ఫోటోలు చూసిన బుగట్టి చిరోన్ కారు ఖరీదు అక్షరాలా 25 కోట్లు. సరే, డబ్బు బాగా ఉన్నవాళ్లు ఇంత మొత్తం పెట్టి అంత ఖరీదైన కారు కొనుకున్నారు అనుకోవచ్చు. కానీ, ఈ కారుకు కావలసిన నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా రూ.52 కోట్లు పెట్టారు ఆ వాహన యజమాని. అవును మీరు చదివింది నిజమే. కారు కన్నా దాని నెంబరుకు పెట్టిన ఖర్చు రెండింతలు కంటే ఎక్కువ. ఇంతకీ అంత మొత్తం డబ్బు పోసి కొన్న నెంబర్ ఏంటో తెలుసా? లక్కీ 9.
ఈ కారు వీడియోను ఆ కారు యజమాని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. ఈ వీడియోలో బుగట్టి చిరోన్ నంబర్ ప్లేట్ ఎందుకు ఇంత ఖరీదు అని వివరించాడు. నెంబర్, నెంబర్ల సంఖ్య బట్టి అక్కడ వేలం పాటలో ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది అని అన్నారు. అదే నాలుగు నంబర్స్ ఉంటే తక్కువగాను ఒక నెంబర్ మాత్రమే ఉంటే చాలా ఎక్కువం మొత్తం ఖర్చు అవుతుంది. అక్కడ చాలా మంది వీటి కోసం వేలం పాటలో పాల్గొంటారు అని వివరించాడు. తర్వాత మంచి ధర వచ్చాక దానిని అమ్మేస్తారు అని కూడా పేర్కొన్నాడు. ఈ కారణంగా నంబర్ ప్లేట్ ధర పెరుగుతుంది అని తెలిపాడు.

ఇలా కార్ల నెంబర్ల కోసం ఎక్కువ ధరలు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. దీనికంటే ప్రపంచంలో మరింత ఖరీదైన నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ‘ఎఫ్ 1’ అనే నంబర్ ప్లేట్ కోసం రూ.132 కోట్లు పెట్టి అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి కొన్నాడు. అతని కూడా బుగట్టి చిరోన్ కోసం నంబర్ ప్లేట్ తీసుకున్నాడు. ఇక మన దేశానికి చెందిన బల్విందర్ సింగ్ అనే వ్యక్తి తన రోల్స్ రాయిస్ కోసం రూ.67 కోట్లు పెట్టి కొన్నాడు. ఇది అతని రోల్స్ రాయిస్ కంటే చాలా ఎక్కువ. కేవలం ‘1’ ఉన్న మరో నంబర్ ప్లేట్ ను 2008లో 66 కోట్లకు విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నంబర్ ప్లేట్లు చాలా ఉన్నాయి. వాటిని కొనుగోలు కూడా చేయవచ్చు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.