Spanx Company Boss

సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్‌లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. రెండవ రకం బాస్‌లు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసిన సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలని వారిని ఎక్కువ ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్‌లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. కానీ, ఈ కోవకు చెందిన బాస్‌లు వారి ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. అవసరం వచ్చినప్పుడు కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు కొంత వాటా కూడా ఇస్తారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో రకానికి చెందిన ఈ మహిళా బాస్‌ మీద సోషల్ మీడియాలో ప్రశంల వర్షం కురుస్తుంది. ఈ మహిళా యాజమానిని అమ్మతనం చూపించావ్‌ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్‌ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీకి వచ్చిన లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్‌.

స్పాంక్స్‌ కంపెనీ యజమాని పేరు సారా బ్లేక్లీ. ఇక బ్లాక్‌స్టోన్ స్పాంక్స్‌ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీకి చెందిన కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే, అలా వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది. ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్‌ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here