సాదారణంగా వెబ్ సిరీస్ లేదా మూవీస్ లకు సంబంధించిన వీడియోలకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి కొంటారు. కానీ విచిత్రంగా ఒక వీడియోలో ఒక పసిపిల్లవాడు మరో పసిపిల్లవాడి వెలును కొరికిన వీడియోకు భారీ మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. ఇది ఒకింత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.(ఇది కూడా చదవండి: బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. రూ.1000 క్యాష్ బ్యాక్)
వేలంలో 5.5 కోట్లు పలికిన వీడియో
2007లో యూట్యూబ్‌లో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ అనే ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. ఆ వీడియో నెటిజన్లను భాగ ఆకట్టుకోవడంతో ఇప్పటికే సుమారు 88 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇటీవల నిర్వహించిన నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతి (ఎన్ఎఫ్‌టి)లో వేలంపాట నిర్వహించగా ఏకంగా 11 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. దీంతో ఈ వీడియో ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్ముడుపోయి ఓ సంచలనంగా మారింది. ఎన్ఎఫ్‌టి (నాన్ ఫంజిబల్ టోకన్స్) అంటే ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులని అర్థం. వీటిని బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఇటీవల కాలంలో ఎన్ఎఫ్‌టి వేలంలో అనేక ఫోటో, ఆర్ట్ లు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి.

ఈ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే చిన్నోడు.. తన అన్న హ్యారీ డేవిస్ కార్ యొక్క వేలును సరదాగా కొరుకుతాడు. దాంతో మరోసారి నోట్లో వేలు పెట్టడంతో ఈసారి గట్టిగా కొరుకుతూ కాసేపు అలా నోట్లోనే ఉంచుతాడు. దీంతో కొరికిన బుడ్డోడు నవ్వులతో… కొరికించుకున్న పెద్దోడు కన్నీళ్లతో మనకు కనిపిస్తారు. తన అన్న వద్దు వద్దు అని ముద్దు ముద్దుగా అంటాడు. ఈ ఫన్నీ వీడియో అందరికీ భాగ నచ్చేసింది. అయితే, ఇటీవల ఈ వీడియోను వేలంలో పెట్టగా, 5.5 కోట్లకు అమ్ముడు పోవడంతో ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇప్పుడు వారు పెద్దగా ఉన్న ఫోటోలు కూడా నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.