ప్రముఖ టెక్ కంపెనీ తన ఉద్యోగులకు బంప‌ర్ ఆఫర్ అందించింది. చాలా ప్రైవేట్ కంపెనీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాయి. దేశీయ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు బహుమతి ఇవ్వడానికి సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. హెచ్‌సీఎల్ కంపెనీ తన టాప్ పెర్ఫార్మింగ్ ఉద్యోగులకు కొత్త మెర్సిడెస్ బెంజ్ కార్లను బహుమతిగా ఇవ్వాలని చూస్తుంది.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన ఒక నివేదిక ప్రకారం.. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆమోదం కోసం కంపెనీ బోర్డు వద్ద ఉంది. అయితే, కంపెనీ తన ఉద్యోగులకు ఇలాంటి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు. 2013లో కంపెనీ తన టాప్-పెర్ఫార్మింగ్ ఉద్యోగులకు 50 మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. హెచ్‌సీఎల్‌లో మెరుగైన రిటెన్ష‌న్ ప్యాకేజ్ ఉంద‌ని, ఏటా సీటీసీలో 50 నుంచి 100 శాతం న‌గ‌దు ఇన్సెంటివ్ స్కీమ్ ఆఫ‌ర్ చేస్తున్నట్లు కంపెనీ సీహెచ్ఆర్వో వీవీ అప్పారావు అన్నారు. దీని ద్వారా నాయ‌క‌త్వ బృందాల్లో కీల‌క నైపుణ్యాలు క‌లిగిన 10 శాతం మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని వెల్ల‌డించారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here