మనకు పెద్దలు ఎల్లప్పుడూ ఒక మాట చెప్తుంటారు. బుర్ర చెప్పింది వింటే బాగుంటాం.. అదే మనసు చెప్పింది వింటే సంతోషంగా సంతృప్తిగా జీవిస్తామని. ఈ మాటని అక్షర సత్యం చేసి చూపించాడు ఒక ఐఐటీ పూర్వ విద్యార్థి. ఐఐటి ఖరగ్ పూర్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి అయ్యాక.. అమెరికాలో అధిక వేతనం ఇస్తున్న ప్రతిష్టాత్మక ఇంటెల్‌ కంపెనీలో పని చేస్తున్న ఓ ఇంజనీర్‌ దాన్ని వదిలేసుకుని భారత్ కుతిరిగి వచ్చి తనకు ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను సంతృప్తిగా బతకడమే గాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు.

ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ఉద్యోగం వదిలి వచ్చిన తర్వాత 20 ఆవులను కొని వాటితో ఇప్పుడు ఏకంగా ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం సంపదిస్తున్నాడు. అతడి విజయ గాధ వివరాలు.. కర్ణాటకకు చెందిన కిశోర్ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్న అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒకటైన మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికన్ టెక్ దిగ్గజం ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. మంచి జీతం, మంచి ఉద్యోగం అయినప్పటికి అతడికి సంతృప్తి లేదు. కొన్ని రోజులకు ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనుకోని విదంగా మలుపు తిరిగింది.

కర్ణాటకకు వచ్చిన తర్వాత ఒకరోజు పని నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. అప్పుడు అతను నగరంలో సురక్షితమైన హైజెనిక్ పాలను అందించే వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారని వెంటనే గ్రహించాడు. ఈ విధంగా 2012లో కిశోర్ ఇందుకూరి వ్యాపార సామ్రాజ్యానికి బీజం పడింది. ఆ ఏడాదిలో 20 ఆవుల పెట్టుబడితో డైరీ ప్రారంభమైంది. వారు డైరీ ఫామ్ లో సేంద్రీయ పాలను ఉత్పత్తి చేస్తూ ఆ పాలను నేరుగా వినియోగదారుల ఇంటికి అందించే వాడు. పాలు తీసే సమయం నుంచి పంపిణీ చేసే వరకు పాల చెడిపోకుండా ఫ్రీజ్, స్టోర్ వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. అయితే, ఈ విజయం అంత తేలికగా దక్క లేదని మొదటి కొన్ని నెలలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.

2018 నాటికి డెయిరీ భాగ విస్తరించింది. అతని కుమారుడు ‘సిద్ధార్థ్’ పేరిట దానికి “సిద్’స్ ఫామ్” అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫామ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల 6,000 మంది వినియోగదారులకు పాలు పంపిణీ చేస్తున్నారు. నేడు, షాబాద్ లో ఉన్న “సిద్స్ ఫామ్(sid’s farm)” ద్వారా 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పాలతో ప్రారంభమైన సిడ్స్ ఫార్మ్ ద్వారా ఇప్పుడు సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. ప్రతి రోజు ఆ సంస్థ ఇప్పుడు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది.

ఇక ఈ డెయిరీ వార్షిక ఆదాయం రూ.44 కోట్లు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఇందుకూరి డైరీ విజయం సులభంగా అనిపిస్తున్నప్పటీకీ ప్రారంభ రోజులు తమ వినియోగదారులకు తాజా పాల డెలివరీని అందించడానికి ఎంతో కష్ట పడ్డట్లు తెలిపాడు. మొదట్లో కిశోర్ ఇందుకూరి తన పొదుపు మొత్తాన్ని దీనిపై పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నాడు. డైరీని ఏర్పాటు చేయడానికి తన కుటుంబం నుండి సహాయం కోరాడు. ప్రారంభ పెట్టుబడి కింద కోటి రూపాయలు, తర్వాత మరో 2 కోట్లు పెట్టాడు. ఇలా అతను కలను నిజం చేసుకున్నాడు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here