82 Year Old Woman Beat Covid 19

Prone Breathing Technique: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ చూసి చాలా మంది తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎక్కడ కరోనా సోకుతుందో అని కంగారు పడుతున్నారు. ఇలా దానిని చూసి భయపడటం వల్ల రోగనిరోదక శక్తి తగ్గిపోయి చనిపోతున్నారని ఇటీవల మనం వార్తల్లో చూసి ఉంటాం. అందుకే, అది ఎక్కడో వస్తుందో భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి కరోనా వంటి మహమ్మరి నుంచి తప్పించుకోవచ్చు అని 82 ఏళ్ల బామ్మ నిరూపించింది.

డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల సహకారానికి తోడు తన మనోధైర్యంతో 82 ఏళ్ల బామ్మ ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే కరోనాను జయించి వార్తల్లో నిలచింది. ఉత‍్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలికి ఈ నెల ప్రారంభంలో కరోనా సోకింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కుమారుడు శ్యామ్‌ శ్రీవాస్తవ డాక్టర్లను సంపద్రించాడు. వారు ఇచ్చిన సలహాలతో కేవలం 12 రోజుల్లోనే హోం ఐసోలేషన్‌ లో ఉండి కరోనా నుంచి కొలుకుంది.(ఇది కూడా చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!)

ఈ సందర్భంగా ఆమె పెద్ద కుమారుడు హరి మోహన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘ ఏప్రిల్‌ నెల ప్రారంభంలో మా అమ్మకు కరోనా సోకింది. అప్పుడు ఆమె శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి 79కి పడిపోయింది. దీంతో మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. అప్పుడు ఆస్పత్రుల్లో ఉన్న పరిస్థితులు చూసి డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాం. ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగేందుకు ఆమె చేత ప్రోనింగ్‌ ప్రొజిషన్‌ ప్రాక్టీస్‌ చేయిస్తూ లవంగం, కర్పూరం క‌రోమ్ సీడ్స్ తో గల మిశ్రమం త‌యారు చేసి ఆవిరి పీల్చడంతో ఆరోగ్యం కుదుట ప‌డింది. అలా చేయ‌డం వ‌ల్ల ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ కేవ‌లం నాలుగు రోజుల్లో 94కి పెరిగాయి. ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకున్నా డయాబెటిస్, అధిక రక్తపోటు స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్న మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది’’ అని చెప్పారు.

ప్రోనింగ్ అంటే ఏమిటి?

క‌రోనా వైర‌స్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు పాత కాలంలో చెప్పినట్టు బోర్లా ప‌డుకోవాలి. చాలా ఆస్ప‌త్రుల‌లో ఊప‌రి ఆడ‌ని క‌రోనా పేషెంట్ల ఈ పద్ధతిని అనుస‌రిస్తున్నారు. వైద్య భాషలో దీన్ని ప్రోనింగ్ అంటారు. ఇలా రోజుకి ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయ‌డం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవ‌చ్చ‌ని డాక్ట‌ర్లు సిఫార్సు చేస్తున్నారు.

ప్రోనింగ్ పొజిషన్ అని పిలువబడే ఈ టెక్నిక్ తీవ్రమైన శ్వాస వ్యాధి సిండ్రోమ్(ఎఆర్ డిఎస్) ఉన్న రోగుల చికిత్స కోసం చాలా సమర్దవంతంగా పనిచేస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోనింగ్ వ్యాయామం రోజుకు మూడుసార్లు చేయ‌డం వల్ల శరీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ మెరుగ్గా ఉంటాయి. అదే స‌మ‌యంలో ఈ ప్రోనింగ్ పోజిష‌న్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ల్స్ మీట‌ర్ సాయంతో ఆక్సిజన్ లెవ‌ల్స్‌ను నిరంతరం పరీక్షించుకోవాలి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.