గత కొన్ని రోజులుగా సోనూసూద్‌ చెందిన ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎటువంటి సంబంధం లేనివారికే ఎన్నో ఇచ్చిన సోనూసూద్ ఫాదర్స్‌డేను పురస్కరించుకుని తన పెద్ద కొడుకు ఇషాన్‌కు సుమారు రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ కారులో సోనూ ఫ్యామిలీ షికారుకు కూడా వెళ్లినట్టు కథనాలు అల్లేశారు మహానుబావులు. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సోనూసూద్‌ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పేసాడు. తన కొడుక్కు కారును బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశాడు.

కేవలం ట్రయల్‌ టెస్ట్ కోసమే కొత్తకారును ఇంటికి తీసుకొచ్చామే తప్పితే దాన్ని కొనుగోలు చేయలేదని అయినా ఫాదర్స్‌డే రోజు ఎవరైన పిల్లలు తండ్రికి ఇవ్వాలి కానీ తానెందుకు వాడికి కారు కొనిఇస్తాననని ప్రశ్నించాడు. అయితే చాలామంది ఈ ఊహాగానాలు నిజమేనని నమ్మేశారు. అందుకే కొన్నిసార్లు ఇలాంటి పుకార్లు వార్తలు చదివేటప్పుడూ ఒకటి రెండూ సార్లు ఆలోచించాలని కోరాడు. తనకు మద్దతిస్తూ మాట్లాడటం సంతోషాన్నిచ్చిందన్నాడు. ఇక ఫాదర్స్‌డే రోజు కొడుకులిద్దరితో సమయం గడపడం ఎంతో అమూల్యమైన కానుకగా సోనూసూద్‌ అభివర్ణించాడు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.