సోషల్‌ మీడియా వల్ల చెడు ఎంత జరుగుతుందో.. మంచి కూడా అంతే జరుగుతుంది అని చెప్పుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం లభించాలన్న, రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలన్నా అది కేవలం సోషల్‌ మీడియాతోనే సాధ్యం అవుతుంది. కన్ను గీటతో ప్రియా వారియర్‌, పాకిస్థాన్ లో టీ అమ్ముకునే వ్యక్తి రాత్రికి రాత్రికే పెద్ద మోడల్ గా మారిపోయాడు, నీలి కళ్లు, అందమైన రూపంతో ఉన్న అర్షద్‌ ఖాన్‌ లాంటి వారందరిని సోషల్‌ మీడియా రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మార్చింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందమైన యువతి వచ్చి చేరింది.

తన అందమైన రూపంతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఒక వీడియో ఇప్పటివరకు 2 మిలియన్ల మంది వీక్షించారు. జాస్మిన్‌ సైని అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ యువతి కట్టెల పొయ్యి ముందు కూర్చుని.. చేతలతో చాలా అలవోకగా క్షణాల్లో రొట్టెలు చేస్తుంది. యువతి వెనక కుక్కలు, పిల్లలు ఆడుకోవడం చూస్తే.. ఏదో పల్లెటూరులాగా అనిపిస్తుంది. ఇక ఈ వీడియోని మీరు చూస్తున్నంతసేపు యువతి ముఖం మీద నుంచి చూపు తిప్పుకోలేరు.

ఇక వీడియోని చూసిన వారంతా మరో సోషల్‌ మీడియా సెలబ్రిటీ.. నీ ముందు హీరోయిన్‌లు కూడా దిగదుడుపే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అమ్మాయి చూడటానికి చాలా అమాయకంగా ఉంది. ఆమె పేరు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈ వీడియో చూసిన కొందరు ఆమెను బాలీవుడ్ లో యాక్ట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. వీడియో కోసం ఈ లింకు క్లిక్ చేయండి.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.