BIS Care App: పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలగజేస్తుంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీ ప్రోడక్ట్స్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం.
నకిలీ ఉత్పత్తులను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుంచి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది. మనం ఈ కథనంలో నకిలీ ఉత్పత్తులను BIS Care App సహాయంతో ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం.
నకిలీ ఉత్పత్తులను BIS Care Appతో ఎలా కనిపెట్టాలి..?
- మొదట BIS Care Appను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
- ఆ తర్వాత Verify R-Number మీద క్లిక్ చేసి మీరు కొనుగోలు చేసిన ప్రొడక్ట్ మీద ఉన్న R-Number నమోదు చేయండి.
- ఇప్పుడు మీరు కొన్న ప్రొడక్ట్’కి సంబంధించిన వివరాలు వస్తే అది ఒరిజినల్ ప్రొడక్ట్ లేకపోతే నకిలీ అని మనం గుర్తుంచుకోవాలి.
- Advertisement -