అమెజాన్ తన యూజర్ల కోసం కొత్తగా రైలు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్ మరియు మొబైల్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొంది. త్వరలో iOS ప్లాట్‌ఫామ్‌ యూజర్లకు ఈ ఫీచర్ తీసుకొస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరగా మొబైల్‌లో టికెట్ బుకింగ్ కోసం స్కాన్ చేయగల QR కోడ్‌ను కూడా అందుబాటులో ఉంచింది. తొలిసారి టికెట్ బుకింగ్‌పై వినియోగదారులు 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ .100 వరకు) పొందుతారని అమెజాన్ తెలిపింది. ఇక ప్రైమ్ సభ్యులుకు తమ మొదటి బుకింగ్ పై 12 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 120 వరకు) పొందవచ్చు. మరిన్ని వివరాలు ప్రకటించనప్పటికీ, పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. కొంతకాలం పాటు అమెజాన్‌.ఇన్‌ కూడా పేమెంట్‌ గేట్‌వే ఫీజ్‌ను రద్దు చేసింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here