ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ ఓఎస్‌తో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు యూజర్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ ప్రతి ఏడాది అప్‌డేటెడ్ వెర్షన్‌ని తీసుకొస్తున్నారు. గత ఏడాది ఆండ్రాయిడ్ 11లో ఛాట్ బబుల్స్‌, కన్వర్జేషన్‌ నోటిఫికేషన్స్, బిల్ట్‌-ఇన్ స్క్రీన్ రికార్డర్‌ వంటి కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ ఓఎస్ చాలా మందికి అందుబాటులోకి రాలేదు. కానీ, అప్పుడే రాబోయే ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు లీక్ అవ్వడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 12ని ఎప్పుడు విడుదల చేస్తారు.. ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయనేది ఒకసారి తెలుసుకుందాం..(ఇది చదవండి: ఐటీ దిగ్గజ కంపెనీలను, అమెరికాను వణికించిన అతిపెద్ద హ్యాకర్ ఎవరో తెలుసా?)

  • గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్‌ తన కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తీసుకొస్తారు. ఈ ఏడాది కూడా అలానే తీసుకొస్తారని మొబైల్ ప్రియులు భావిస్తున్నారు. కానీ, ఈ ఏడాది కరోనా, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్న కారణంగా కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో తీసుకురావొచ్చని భావిస్తున్నారు.
  • ఆండ్రాయిడ్ 12లో ఆండ్రాయిడ్ రన్‌టైమ్(ఎఆర్‌టి)ను మెయిన్‌లైన్ మాడ్యూల్‌గా మార్చాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరిన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ లు లభించనున్నాయి. దీంతో కొత్త అప్డేట్ మనకు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్ కి వెళ్లి మన మొబైల్ ఓఎస్ అప్డేట్ చేసుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్ 12 తక్కువగా ఉపయోగించే, వినియోగంలో లేని యాప్ లను ‘హైబర్నేట్’ చేసే ఫీచర్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో మన బ్యాటరీ సామర్ధ్యం పెరగనుంది.
  • పిక్సెల్‌ ఫోన్ ఆదారంగా ఫోన్‌ వెనకవైపు డబుల్ ట్యాప్‌ చేస్తే కొన్ని రకాల ఫీచర్స్‌ ఓపెన్ అయ్యేలా షార్ట్‌కట్‌లను తీసుకు రాబోతున్నారు. వాటిలో గూగుల్ అసిస్టెంట్, స్నూజ్‌ అలారమ్స్, స్క్రీన్‌ షాట్స్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఇవే కాకుండా యాప్‌ పెయిరింగ్, వైఫై పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్స్‌, మీడియా ప్లేబ్యాక్‌ కంట్రోల్స్‌ కూడా ఇస్తున్నారనేది సమాచారం.
  • ఆండ్రాయిడ్ ఓఎస్‌ విడుదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు మినహా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ఈసారి యూఐలో కూడా కీలక మార్పులు చేస్తారని సమాచారం. యూజర్లకు మంచి అనుభూతిని కలిగించే విదంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్ లో మార్పులు చేస్తునట్టు సమాచారం.
  • ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఉపయోగించే ఫోన్‌ కంపెనీలు ఆండ్రాయిడ్ యూఐలో మార్పులు చేసి సొంతగా యూఐను పరిచయం చేస్తున్నాయి. మరి ఆండ్రాయిడ్ 12 కొత్త యూఐలో ఎటువంటి మార్పులు మార్పులు చేస్తాయా.. తెలుసుకోవాలంటే మరి కొద్ది నెలలు ఆగాల్సిందే.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here