ప్రస్తుతం ఆటోమొబైల్స్, షాపింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు గాడ్జెట్ కంపెనీలు వాటి వస్తువులపై తగ్గింపు పనిలో ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని పలు గృహోపకరణాలు మరియు ఎలక్ట్రానిక్ కంపెనీలు పండుగ ఆఫర్‌ను ప్రకటించాయి. పండుగ కాలంలో డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మీరు వివో వి20 ఎస్, వి20 మరియు ఎక్స్ 50 సిరీస్‌లను కేవలం రూ.101 చెల్లించి వివో స్మార్ట్‌ఫోన్ లను కొనొచ్చు. మీరు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, ఫెడరల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డును ఉపయోగించడం ద్వారా 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

వివో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఒకసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉచితంగా లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వివో అప్‌గ్రేడ్ ప్లాన్‌లో భాగంగా రూ.1500 అడిషనల్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 80 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లకు ఈ ఆఫర్ లభిస్తుంది. కస్టమర్లు తమకు నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసిన తర్వాత రూ.101 చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ఈఎంఐల ద్వారా చెల్లించాలి. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వివో స్టోర్‌లో తెలుసుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here