ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ కోసం ఆపిల్ ఈ సంవత్సరం ఈవెంట్ కోసం సన్నద్ధమవుతోంది. టెక్ దిగ్గజం క్యాంపస్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ నుండి ప్రసారం కానుంది. అక్టోబర్ 13న జరిగే ఈ వర్చువల్ ఈవెంట్ కోసం సంస్థ “హాయ్, స్పీడ్” అనే ట్యాగ్ లైన్‌తో అందరికీ మంగళవారం ఆహ్వానాలను పంపింది. ఈ కార్యక్రమం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.అయితే ఈ ఈవెంట్ లో ఆపిల్ కొత్త ఐఫోన్‌లు, చిన్న హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్, ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్, సరికొత్త ఆపిల్ టివి స్ట్రీమింగ్ బాక్స్ మరియు ఇప్పటికే పుకారు పుట్టిన టైల్ లాంటి లొకేషన్ ట్రాకింగ్ పరికరాన్ని కూడా విడుదల చేయనున్నారు.(చదవండి: వర్షాకాలంలో ఇంటర్నెట్ వేగం ఎందుకు తగ్గుతుంది?)

‘హాయ్, స్పీడ్’ ట్యాగ్‌లైన్ అర్థం ఏమిటనే దానిపై ఇప్పటికే చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఈసారి సలహా 5జి టెక్నాలజీ, వేగవంతమైన A14 ప్రాసెసర్ తీసుకురానునట్లు తెలుస్తుంది. అక్టోబర్ 13 జరిగే ఆపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 12ను హైలైట్ చేస్తుంది. ఈ సంవత్సరం, ఆపిల్ 5.4-అంగుళాల ఐఫోన్ 12, 6.1-అంగుళాల ఐఫోన్ 12 మాక్స్, 6.1-అంగుళాల ఐఫోన్ 12 ప్రో మరియు 6.7-అంగుళాల ఐఫోన్ 12 ప్రోతో సహా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేస్తుంది. ఈ నాలుగు ఐఫోన్ మోడళ్లలో మెరుగైన డిజైన్లు, కొత్త A 14 ప్రాసెసర్, స్మాల్ నాచ్ మరియు మంచి కెమెరాలు ఉంటాయి. ఐప్యాడ్ ప్రో ఎలా ఉందో అదేవిధంగా ఐఫోన్ 12 ఫ్లాట్ అంచులతో బాక్సియర్ డిజైన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐఫోన్ 12 5జి కనెక్టివిటీ కి సపోర్ట్ చేసే మొట్ట మొదటి ఫోన్ ఇదే.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.