ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. హ్యాకింగ్ భారీ నుంచి యూజర్లను కాపాడటం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించనుంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న సెకండ్ స్టెప్ వెరిఫికేషన్‌ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను హ్యాకింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. సాధారణంగా గూగుల్ అకౌంట్‌ను ఎక్కువగా వాడే పరికారాల్లో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది.
అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో(2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్‌ను ట్రేస్ చేయడానికి వీల్లేని విధంగా ఈ కొత్త విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, దీనివల్ల రకరకాల సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి హ్యాకర్లు పాస్‌వర్డ్‌ను ఊహించడం లేదంటే వాటిని దొంగతనం చేసి అకౌంట్‌లోకి లాగిన్ కావడం లాంటి చర్యలు కూడా కష్టతరం కానున్నాయి. Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. (చదవండి: మార్క్ జూకర్‌బర్గ్‌కు 6 గంటల్లో 50 వేల కోట్ల నష్టం)

ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ అనుమతి లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్‌ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు.