ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో, టెక్ దిగ్గజం గూగుల్ కలిసి అతి తక్కువ ధరకే జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సమావేశం సందర్భంగా జియోఫోన్ నెక్ట్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో కంపెనీ ఫీచర్లను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ను ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు వినాయక చవతి సందర్భంగా తీసుకొనిరానున్నట్లు ముకేష్ అంబానీ ప్రకటించారు. విడుదలకు ముందు ఈ ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు అంతర్జాలంలో లీక్ అయ్యాయి.

లీకైన జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్

జియోఫోన్ నెక్ట్స్(కోడ్ నేమ్డ్-ఎల్ఎస్-5701-జె) గురించి ఎక్స్ డిఎ డెవలపర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిషాల్ రెహమాన్ లీక్ చేశారు. జియోఫోన్ సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. దీనిలో హెచ్ డి+ డిస్ ప్లే ఉంది. ఈ మొబైల్ 64 బిట్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ క్యూఎమ్215 ప్రాసెసర్, క్వాల్ కామ్ అడ్రెనో 308 జీపీయు సహాయంతో పనిచేస్తుంది. ఈ చిప్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్5 ఎల్ టిఈ మోడెంతో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ జీపీఎస్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్, బ్లూటూత్ 4.2తో వస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరాకు 8 మెగా పిక్సల్ రిజల్యూషన్ తో వస్తుంది. రిలయన్స్ ఈ ఫోన్ ప్రపంచంలోనే చౌకైన స్మార్ట్ ఫోన్ గా ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సమావేశంలో ప్రకటించింది. ₹4,000 కంటే తక్కువ ధరకు తీసుకొనిరావలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు.

Support Tech Patashala