బెల్జియం పోలీసులు ప్రమాదకరమైన ‘జోకర్’ వైరస్ తిరిగి వచ్చినట్లు ఇటీవల ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులను అలర్ట్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన మాల్‌వేర్‌లలో ఒకటైన ఈ జోకర్ వైరస్, ఆండ్రాయిడ్ మొబైల్స్ పై దాడి చేసి గూగుల్ ప్లే స్టోర్లలోని వివిధ యాప్స్ లో దాగి ఉంటుంది. ఈ వైరస్ యూజర్ల అనుమతి లేకుండానే వారి ఫోన్ లోకి ప్రవేశించి నగదు లావాదేవిలను వారికి తెలియకుండానే నిర్వహిస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ 8 యాప్స్ ను తొలిగించినట్లు బెల్జియన్ పోలీసులు తెలిపారు.

రెండూ నెలల క్రితం జూన్ లో ఈ 8 యాప్స్ ను క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ పరిశోధకులు ముందుగానే గుర్తించారు. ఆండ్రాయిడ్ వినియోగదారులు వెంటనే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ యాప్స్ తొలిగించాలని టెక్ నిపుణులు పేర్కొన్నారు. తమ ఫోన్ల ఈ యాప్స్ ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులు జోకర్ మాల్వేర్ భారీన పడుతున్నట్లు బెల్జియన్ పోలీసులు తెలిపారు. ఈ మాల్‌వేర్‌ గనుక ఒక్కసారి మన ఫోన్‌లోకి వస్తే ఇక అంతే సంగతులు..! మీ ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని హకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేగాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్‌ మాల్‌వేర్‌ తొలిసారిగా 2017 గూగుల్‌ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. ఈ మాల్‌వేర్‌ మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియకుండానే హ్యాకర్లకు చెరవేస్తుంది.

8 ఆండ్రాయిడ్ యాప్స్

  1. Auxiliary Message
  2. Element Scanner
  3. Fast Magic SMS
  4. Free Cam Scanner
  5. Go Messages
  6. Super Message
  7. Super SMS
  8. Travel Wallpapers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here