షియోమీ భారతదేశంలో తాజాగా నేడు ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఎంఐ 10ఐలోని ‘ఐ’ అంటే ఇండియా అని, భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారతదేశంలో శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 సెన్సార్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఎంఐ 10ఐ ప్రసిద్ది చెందింది. ఎంఐ 10ఐలో ముఖ్యంగా 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 సెన్సార్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ వంటివి ఉన్నాయి.
ఇంకా చదవండి: వామ్మో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?
ఎంఐ 10ఐ ఫీచర్స్:
డిస్‌ప్లే | 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే |
రిఫ్రెష్ రేట్ | 120 హెర్ట్జ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ |
ప్రాసెసర్ | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ, 619 జీపీయూ |
ర్యామ్ | 8జీబీ |
స్టోరేజ్ | 128జీబీ |
ప్రైమరీ కెమెరా | 108 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ |
సెల్ఫీ కెమెరా | 16 మెగా పిక్సల్ |
బ్యాటరీ | 4,820ఎమ్ఏహెచ్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ |
కనెక్టివిటీ | 5జీ, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్ |
సెన్సార్ | సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ |
భారతదేశంలో ఎంఐ 10ఐ 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు ధర రూ.20,999, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.21,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.23,999 రూపాయలు. ఈ ఫోన్ పసిఫిక్ సన్‌రైజ్, మిడ్నైట్ బ్లాక్ మరియు అట్లాంటిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎంఐ 10ఐ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ ఇతర స్టోర్లలో జనవరి 7న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ కి రానుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.