మనం ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్లలలో చాలా వరకు చైనాకి చెందిన మొబైల్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, మనలో చాలామందికి మనం ఇండియా నుండి ఒక మొబైల్ వస్తే బాగుండు అని చాలా సార్లు కోరుకుంటాం. మీ కోరికను నిజం చేస్తూ దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్ మార్కెట్ లోకి సరికొత్త మొబైల్స్ తో రాబోతుంది. “ఇన్” సిరీస్ లో ఈ మొబైల్స్ తీసుకువస్తునట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది. ఇప్పుడు, తాజాగా ఆ మొబైల్స్ ను లాంచ్ చేసే తేదీని తెలిపింది. నవంబర్ 3న మద్యాహ్నం 12 గంటలకు “ఇన్” సిరీస్ స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తునట్లు కంపెనీ తన సామాజిక మాధ్యమాల ద్వారా ఒక టీజర్‌ను విడుదల చేసింది. అయితే, ఈ సిరీస్ లో భాగంగా ఎన్ని ఫోన్లు రాబోతున్నాయి? ఏ ఏ ధరలలో వీటిని తీసుకువస్తునారు? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.(చదవండి: ఐఫోన్ 12 మొబైల్ బాక్స్ లో చార్జర్, ఇయర్ ఫోన్స్ ఎందుకివ్వలేదంటే?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here