మైక్రోమాక్స్ తన ఇన్ 1 స్మార్ట్ ఫోన్ ను మార్చి 19న భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో మెటాలిక్ ఫినిష్, వెనకవైపు ఎక్స్ ప్యాటర్న్ ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ కెమెరాను కలిగి ఉంది. మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో రెండు ర్యామ్ + స్టోరేజ్ వేరియంట్లు + కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇన్ 1 ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1 నేడు (మార్చి 26) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మైక్రోమాక్స్ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి రానుంది. అయితే ఈ మొబైల్ ఎలా ఉంది అనేది పూర్తిగా తెలుసుకుందాం.
మైక్రోమాక్స్ ఈ మొబైల్ లో రూ.9,999 ధరకు తగ్గట్టు మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు చెప్పుకోవాలి. బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా పరంగా కూడా భాగానే ఉంది. ఇది పూర్తిగా ఆండ్రాయిడ్ వన్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. పదివేల లోపు మొబైల్ కొనులనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ప్రస్తుతం మార్కెట్ లో పదివేల లోపు ఉన్న మొబైల్స్ కంటే ఇందులో మంచి డిస్ప్లే తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ హెచ్ డి వీడియొ సపోర్ట్ ఉన్న కూడా వీడియొ ప్లే కావడం లేదు. ఇది ఒక బగ్ అని చెప్పుకోవాలి.(ఇది చదవండి: వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా గెలుచుకోండిలా?)

మైక్రోమాక్స్ ఇన్ 1 మొబైల్ లో తీసుకొచ్చిన మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ భాగానే పనిచేస్తుంది. మీడియం గేమ్స్ విషయంలో మంచి పనితీరు కనబరిచినప్పటికి పబ్ జీ, కాల్ ఆఫ్ డ్యూటి వంటి హై గేమ్స్ ఎక్కువ సేపు అడుతున్నప్పుడు లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్ లను మనం గమనించవచ్చు. 30 నిమిషాలు గేమ్స్ అడితే మొబైల్ ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. బ్యాటరీ 30 నిమిషాలు పబ్ జీ గేమ్ అడితే 10 శాతం వరకు తగ్గింది.

కెమెరా పరంగా భాగానే పనిచేస్తున్నప్పటికి ఇంకా మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. పొటరైట్ షాట్ ఫోటోలు తీసేటప్పుడు కొంచెం సమస్య ఏర్పడుతుంది. డే లైట్ లో మంచిగానే ఫోటోలు తీస్తున్నప్పటికి నైట్ మోడ్ లో ఇంకొంచెం మెరుగుపరచాలి. ఫ్రంట్ కెమెరా భాగానే పనిచేస్తుంది. ఇందులో తీసుకొచ్చిన నైట్ మోడ్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. బ్యాక్, ఫ్రంట్ కెమెరాతో 1080పి వరకు వీడియొ రికార్డు చేయవచ్చు. ఇందులో స్లో మోషన్ వీడియొను 720పి వరకు రికార్డు చేయవచ్చు.

ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. ఒక గంటలో 44 శాతం వరకు చార్జ్ అయితే, ఫుల్ చార్జ్ చేయడానికి 2 గంటల 40 నిమిషాల వరకు సమయం పడుతుంది. దీనిని బ్యాటరీ లైఫ్ వచ్చేసి వన్ ఫుల్ వర్కింగ్ డే వాడుకోవచ్చు. ర్యామ్ మ్యానేజ్మెంట్ కూడా బాగానే ఉంది. ఇందులో అన్నీ సెన్సార్లు తీసుకొచ్చారు. మైక్రోమాక్స్ ఇంకా మంచి ఫీచర్స్ తీసుకు రావాలి. బిల్డ్ క్వాలిటి, వీడియొ క్వాలిటి, స్పీకర్, ఆప్టిమైజేషన్ విషయంలో ఇంకా మెరుగుపరచాలి. మొత్తానికి చెప్పాలంటే రూ.10 వేల లోపు చైనా బ్రాండ్స్ కాకుండా మన దేశీయ బ్రాండ్ కోసం చూస్తే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్.

టోటల్ రేటింగ్: 7.5/10
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.