గూగుల్ ప్లే స్టోర్‌లోని ప్రముఖ డేటింగ్, ట్రావెల్, వీడియో కాలింగ్ యాప్స్ CVE-2020-8913 అనే బగ్ బారిన పడుతున్నాయని చెక్ పాయింట్ సంస్థలోని పరిశోధకులు గుర్తించారు. ఈ బగ్ ను యాప్ లో ప్రవేశపెట్టి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడంతో యూజర్లపై ఎప్పటికప్పుడు నిఘాను ఉంచుతున్నాయని చెక్ పాయింట్ పేర్కొంది. చెక్ పాయింట్ నివేదిక ప్రకారం, వందల మిలియన్ల ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికీ భద్రత పరంగా భారీ ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. నిజానికి గూగుల్ ఈ బగ్‌ను గత ఏప్రిల్‌లోనే సరి చేసింది. తీవ్రత విషయంలో దీనికి 10కి 8.8 రేటింగ్ ఇచ్చింది.(చదవండి: 2021లో సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్ తీసుకొస్తున్న ఆపిల్)
చాలా మంది యాప్ డెవలపర్లు ఇప్పటికీ గూగుల్ కోర్ లైబ్రరీ (జిపిసి) యొక్క పాత వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడే ఈ బగ్ ను కనుగొన్నారు. డెవలపర్లు యాప్స్ ని అప్డేట్ చేయడం కోసం లేదా క్రొత్త ఫీచర్ తీసుకురావడం కోసం గూగుల్ కోర్ లైబ్రరీ (జిపిసి) యొక్క పాత వెర్షన్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల మొబైల్ లో ఈ వైరస్ ప్రవేశిస్తుందని సమాచారం. సెప్టెంబరులో చెక్ పాయింట్ పరిశోధకులు కొన్ని ప్రముఖ గూగుల్ ప్లే స్టోర్ యాప్ లను యాదృచ్ఛికంగా పరీక్షించినప్పుడు 13% మంది జీపీసీని ఉపయోగిస్తున్నారని మరియు వారిలో 8 శాతం మంది బగ్ ముప్పు ఎక్కువగా ఉన్న వెర్షన్‌నే వాడుతున్నారని ఇందులో తేలింది. బంబుల్, ఓక్‌కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ లాంటి యాప్స్ చాలా ఉన్నాయని తెలిపారు. ఈ బగ్ ముప్పు గురించి ముందుగా ఈ యాప్స్ డెవలపర్స్‌కు చెక్ పాయింట్ సమాచారం ఇచ్చింది. ఈ బగ్ ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాతో పాటు, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియాపై నిఘా వేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] మోటోరోలా మోటో జీ 9 పవర్ బడ్జెట్ మొబైల్ ని డిసెంబర్ 8న భారతదేశంలో లాంచ్ చేసింది. మోటో జీ 9 పవర్ ట్రిపుల్ రియర్ కెమెరా, 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. మోటో జీ 9 పవర్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను కూడా అందిస్తుంది. మోటో జీ సిరీస్‌లో మోటో జీ 5జీ ఫోన్‌ను గతవారమే విడుదల చేసిన మోటోరోలా తాజాగా మోటో జీ9 పవర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మోటో జీ 9 పవర్ భారత్‌లో 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.11,999గా ఉంది. ఎలక్ట్రిక్ వైలెట్, మెటాలిక్ ఏజ్ కలర్లలో విడుదలైంది. డిసెంబర్ 15 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభించనుంది.(చదవండి: ప్రమాదంలో 10 కోట్ల ఆండ్రాయిడ్ యూజర్లు) […]