ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా మోటోరోలా రేజర్‌ 5జీ ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయ్యింది. గతంలో వచ్చిన మోటోరోలా రేజర్ ఫోన్ కి కొనసాగింపుగా ఈ ఫోన్ ని తీసుకొచ్చింది. అల్ట్రా ప్రీమియం డిజైన్‌, అత్యుత్తమ సెల్ఫీ కెమెరా, ఫ్లెక్సిబుల్ డిజైన్‌ ఈ ఫోన్‌ యొక్క ప్రత్యేకతలు. అలానే ఫోన్ తెరిచినా, మడతబెట్టినా మధ్యలో ఎలాంటి ఖాళీ లేకుండా హింగ్‌ డిజైన్‌ను ఉపయోగించారు. మెటల్‌, గ్లాస్‌తో ఈ ఫోన్‌ను తయారుచేశారు. దీని యొక్క ఫీచర్స్ క్రింది విదంగా ఉన్నాయి. దీని ధర భారత్ లో వచ్చేసి రూ. 1,24,999గా ఉంది.(చదవండి: వర్షాకాలంలో ఎందుకు ఇంటర్నెట్ వేగం ఎందుకు తగ్గుతుంది?)

మోటోరోలా రేజర్‌ 5జీ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్:

ఈ ఫోన్ కి పవర్ బటన్ వచ్చేసి ఎడమ వైపున ఉంది, వాల్యూమ్ రాకర్ కుడి వైపున ఉంది. ఒక USB-C పోర్ట్ మరియు స్పీకర్ అనేవి కింది భాగాన ఉంది కాని హెడ్‌ఫోన్ జాక్ లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇప్పుడు ఫోన్ వెనుక భాగంలో ఉంది. ఈ మోటోరోలా రేజర్‌ 5జీ ఫోల్డబుల్ ఫోన్ ని తెరిచినప్పుడు రేజర్ 7.9 మిమీ మందం మరియు మూసివేసినప్పుడు16 మిమీ మందంగా ఉంటుంది. మోటో రేజర్‌ 5జీ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. అలానే ఫోన్ మడతబెట్టినప్పుడు నోటిఫికేషన్స్‌, మెసేజ్‌లు చూసేందుకు, సెల్ఫీల కోసం 2.7 అంగుళాల క్విక్‌ వ్యూ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ 8 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌ మడతబెట్టినప్పుడు క్విక్‌ వ్యూ కింది భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ కెమెరా ఇస్తున్నారు. ఇందులో లేజర్‌ ఆటోఫోకస్‌ టెక్నాలజీతో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ఫీచర్‌ ఉంది. ఈ కెమెరాతో ఫోన్‌ మడతబెట్టినప్పుడు కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్‌తో రెండో కెమెరాను ఫోన్‌ తెరిచినప్పుడు డిస్‌ప్లే పై భాగంలో అమర్చారు. 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ టర్బోఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో అక్టోబరు 12 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. పాలిష్‌ గ్రాఫైట్ రంగులో రేజర్‌ 5జీ లభించనుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.