మీరు పాత Android ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా? మీరు మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసే సమయం అసన్నమైంది. నివేదికల ప్రకారం, కొత్త సంవత్సరంలో మీ పాత ఫోన్ అప్ గ్రేడ్ (upgrade) చేసుకోక తప్పదు. 7.1.1 నౌగట్ (nougat) వంటి వర్షన్స్ లో ఉన్న పాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చే ఏడాది నుంచి సపోర్ట్ చేయదని ఆండ్రాయిడ్ పోలీస్ బ్లాగ్ (android police blog) స్పష్టంచేసింది. మీరు ఇకపై 7.1.1 నౌగాట్ లేదా దానికన్నా ముందు నడుస్తున్న మీ పాత ఆండ్రాయిడ్ డివైస్ ల నుండి సురక్షితమైన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయలేరు. మీరు మీ పాత డివైజులను తీసేసి సరికొత్త వర్షన్స్ (new version) కు షిఫ్ట్ అవ్వాల్సిందే. డేటెడ్ ఆపరేటింగ్ సిస్టం (dated operating system) ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ డివైజెస్ తో వెబ్ సైట్లు తెరచుకోవు. కేవలం ఫైర్ ఫాక్స్ (Firefox) ను డౌన్ లోడ్ చేసుకుని మాత్రమే వెబ్ సైట్స్ ను యాక్సెస్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ పోలీసులలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, వినియోగదారులు ఇకపై సురక్షితమైన వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే లెట్స్ ఎన్క్రిప్ట్ సర్టిఫికేషన్ అథారిటీ ఇడెన్‌ట్రస్ట్‌తో భాగస్వామ్యం సెప్టెంబర్ 1, 2021 తో ముగుస్తుందని ప్రకటించింది. మళ్ళీ ఈ ఒప్పందాన్నీ పునరుద్ధరించే అవకాశాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం వెబ్ డొమైన్లు లెట్స్ ఎన్ క్రిప్ట్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. పలు వెబ్ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంల వెబ్ సైట్లకు ట్రస్ట్ సర్టిఫికెట్లు అందించడంలో లెట్స్ ఎన్ క్రిప్ట్ సంస్థ అగ్రస్థానంలో ఉంది. దీంతో లెట్స్ ఎన్ క్రిప్ట్ ట్రస్ట్ సర్టిఫికెట్ లేని బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంలలో సెక్యూర్ వెబ్ సైట్లు పనిచేయవన్నమాట. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ వర్షన్ అంతకన్నా ముందు మార్కెట్లోకి వచ్చిన వర్షన్లకు లెట్స్ ఎన్ క్రిప్ట్ సర్టిఫికెట్ లేదు. దీంతో ఇలాంటి వర్షన్ల ఆధారంగా పనిచేస్తున్న ఫోన్లలో సెక్యూర్ వెబ్ సైట్లు ఓపెన్ కావు.

లెట్స్ ఎన్ క్రిప్ట్ రిపోర్ట్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 33.8శాతం పోన్లు ఈ పాత వర్షన్ల ఆధారంగానే పనిచేస్తున్నాయ. కాబట్టి ఈ పాత ఆపరేటింగ్ సిస్టంలు వాటిని వెంటనే అప్ గ్రేడ్ చేసుకోక తప్పదు. ఇవేవీ వచ్చే ఏడాది సెప్టంబరు నుంచి పనిచేయవన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే 2016 కన్నా ముందు కొన్న ఆండ్రాయిడ్ ఫోన్లతో కొన్ని వెబ్ సైట్లకు యాక్సెస్ ఉండదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here