వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ 8 సిరీస్ కు కొనసాగింపుగా OnePlus 8T ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఇందులో వన్‌ప్లస్ 8 కంటే మెరుగైన ఫీచర్స్ ని తీసుకొచ్చింది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేటు AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరికొన్ని ఫీచర్స్ తో పాటు, ధర, విడుదల తేదీల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 8T ఫీచర్స్
OnePlus 8T ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో వస్తుంది. OnePlus 8T 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్(1,080×2,400 పిక్సెల్స్) 20:9 నిష్పత్తిలో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 402 పిపి పిక్సెల్ డెన్సిటీ కలిగిన ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ, 91.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ప్రాసెసర్ ని ఉపయోగించారు. ఇది 5G కూడా సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ 8 టిలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ స్నాపర్, 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి.(చదవండి: రైతులకు శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం)
సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో EIS మరియు సోనీ IMX471 సెన్సార్ మద్దతుతో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరా 1080p వీడియోను 30 fps వద్ద రికార్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. వన్‌ప్లస్ 8టి 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది బ్లూటూత్ 5.1, వై-ఫై 6, ఎన్‌ఎఫ్‌సికి సపోర్ట్ చేయడంతో పాటు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో వస్తాయి.
OnePlus 8T ధర
భారతదేశంలో వన్‌ప్లస్ 8 టి 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ .42,999 కాగా టాప్-ఎండ్ 12 జీబీ + 256 జీబీ మోడల్ కు ధర రూ .45,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 17 నుండి అమెజాన్.ఇన్ మరియు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తాయి. 8 జిబి మోడల్ ఆక్వామారిన్ గ్రీన్ మరియు లూనార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించగా, 12 జిబి ర్యామ్ మోడల్ కేవలం ఆక్వామారిన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.