ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం వన్ ప్లస్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఒప్పోలో విలీనం కానున్నట్లు వన్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. “మరింత మందికి చేరుకోవడం కోసం వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం” చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ స్వతంత్ర కంపెనీలాగే పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే భారతదేశంలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రకటన చేసింది.

వన్ ప్లస్ తన యూజర్ల కొరకు “ఇంకా మెరుగైన మంచి ఉత్పత్తులను” అందించడానికి ఒప్పోతో విలీనం కానున్నట్లు సీఈఓ ఒక ఫోరం పోస్ట్ లో పేర్కొన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ కూడా చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యానికి చెందినవే. వాటితో పాటు ఇంకా వివో, రియల్ మీ, ఐకూ వంటి బ్రాండ్లు కూడా వీటి కింద ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా ఒకదానితో మరొకటి కలిసి పని చేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కలిసి డిసెంబర్ 2013లో స్థాపించారు. కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ఒప్పోలో పనిచేశారు. తాజాగా రెండు సంస్థలు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఇక నుంచి రెండూ కలిసి పనిచేయనున్నాయి.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.