ప్రస్తుతం బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లకు ఉన్నా ఆధారణ మరే ఫోన్లకు లేదు. సరిగ్గా ఇదే మార్కెట్ ను టార్గెట్ చేస్తూ తక్కువ ధర లోఎక్కువ ఫీచర్లతో ఫోన్ అందించాలనే లక్ష్యంతో షావోమి ప్రవేశపెట్టిన రెడ్‌మీ బ్రాండ్‌కు భారత మార్కెట్లో విశేష ప్రజాదరణ లభించింది. ఈ క్రమంలో రెడ్ మీ బ్రాండ్ ఇప్పుడు బడ్జెట్ ధరలో తొలి 5జీ ఫోన్లను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. తాజాగా రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీని గీక్ గీక్‌బెంచ్‌లో గుర్తించారు. రెడ్‌మి నోట్ 9 5జీ సిరీస్ మొబైల్ ను నవంబర్ 26న చైనాలో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం షియోమి ఫోన్ మోడల్ నంబర్ M2007J17C గల రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ మొబైల్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. రెడ్‌మి నోట్ 9 5జీ సిరీస్ మొబైల్ ఫోన్ ఇప్పుడు గ్లోబల్ మోడళ్ల కంటే భిన్నమైన స్పెసిఫికేషన్‌లతో దేశంలో లాంచ్ కానుందని సమాచారం. (చదవండి: ప్రపంచంలో బెస్ట్ డిస్‌ప్లే ఫోన్ ఇదే!)
పొకో ఎక్స్3 మోడల్ ఆధారంగా వీటిని డిజైన్ చేశారని తెలుస్తోంది. వీటిలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ముందు భాగంలో 16 ఎంపీ (నోట్ 9ప్రో 5జీ), 13ఎంపీ (నోట్ 9 5జీ) సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. మరోవైపు నోట్ 9ప్రో 5జీలో 6.67-అంగుళాల అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడి డిస్‌ప్లే, నోట్ 9 5జీలో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. షావోమి ఎంఐయూఐ 12 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. నోట్ 9ప్రో 5జీలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, నోట్ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ ఉపయోగించారట. 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుందట. రెడ్‌మీ ఈ ఫోన్లలో 5జీ టెక్నాలజీ ఇస్తున్నప్పటికీ వీటి ధర రూ. 17,000 లోపు ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.