ప్రస్తుత మొబైల్ ప్రపంచంలో చైనా స్మార్ట్ కంపెనీల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తక్కువ ధరలో మంచి ధరలో తీసుకొచ్చిన పోకో ఎం2 చాలా ఆధారణ పొందింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా తీసుకురాబోయే మొబైలు ఫోన్ పై చాలా ఆసక్తి మొబైల్ లవర్స్ కి పెరిగింది. తాజాగా మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది పోకో. పొకో ఎం3 పేరుతో వస్తున్న ఈ మొబైల్ శాంసంగ్ ఏ31, ఒప్పో ఏ53, వన్‌ప్లస్ నార్డ్ ఎన్100 మోడల్స్‌తో పోటీ పడనుంది. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 662 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు.(చదవండి: మరో 43 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం)
పోకో ఎం2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే | 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే |
ర్యామ్ | 4 జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 64 జీబీ, 128 జీబీ (Upto + 512 జీబీ) |
ప్రాసెసర్ | స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 662 ప్రాసెసర్ |
ప్రైమరీ కెమెరా | 48 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ |
ఫ్రంట్ కెమెరా | 8 ఎంపీ |
బ్యాటరీ | 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ + 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ12 ఓఎస్ |
కలర్స్ | కూల్ బ్లూ, పొకో యెల్లో, పవర్ బ్లాక్ |
కనెక్టివిటీ | 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి |
అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర 149 డాలర్లు, 169 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 11,042, రూ.12,500. దీన్ని గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేశారు. భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై పొకో నుంచి ఎలాంటి సమాచారం లేదు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.