మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే, జర జాగ్రత్త. ఈ మధ్య మాల్‌వేర్ యాప్స్ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. గూగుల్, సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు ఎన్ని సార్లు గుర్తించి వాటిని తొలిగించినప్పటికి, ఇంకా మాల్‌వేర్ యాప్స్ పూటుకొస్తున్నాయి. తాజాగా మరో ఎనిమిది ప్రమాదకరమైన(మాల్‌వేర్ లేదా యాడ్‌వేర్) యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ గుర్తించి ఆ జాబితాను విడుదల చేసింది.(ఇది కూడా చదవండి: ఉచితంగా సోనీ డీఎస్ఎల్ఆర్ కెమెరా గెలుచుకోండి!)
ఈ యాప్స్ ఎక్కువగా ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్‌సులా ప్రాంతాలకు చెందిన మొబైల్ యూజర్స్‌ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు గుర్తించింది. ఈ యాప్స్ ఫోటో ఎడిటర్స్, వాల్‌పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్, కెమెరా పేరుతో యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ 8 యాప్స్‌ని 7,00,000పైగా మంది డౌన్‌లోడ్స్ చేశారని అంచనా. ఒకవేల మీరు కూడా డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
మొదట ప్లే స్టోర్ యాప్ అప్లోడ్ చేసే సమయంలో గూగుల్ తనికి చేస్తుంది. కాబట్టి గూగుల్ అనుమానం రాకుండా ఉండటానికి క్లీన్ వర్షన్‌ని గూగుల్ ప్లే స్టోర్‌కు సబ్మిట్ చేసి, అప్రూవల్ పొందిన తర్వాత అప్‌డేట్స్ ద్వారా మాల్‌వేర్ ప్రవేశ పెడుతున్నట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. మాల్‌వేర్‌ని గుర్తించిన మెకాఫీ మొబైల్ రీసెర్చ్ యూజర్లను అప్రమత్తం చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 8 యాప్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాకు ముప్పు తప్పదు.
మీరు డిలిట్ చేయాల్సి 8 యాప్స్ ఇవే:
- com.studio.keypaper2021
- com.pip.editor.digital camera
- org.my.favorites.up.keypaper
- com.tremendous.coloration.hairdryer
- com.ce1ab3.app.picture.editor
- com.hit.digital camera.pip
- com.daynight.keyboard.wallpaper
- Com.tremendous.star.ringtones
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.