గత నెలలో వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన కొద్ది రోజులకే అప్పుడే వన్ ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై పుకార్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్లైన్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ కూడా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఉండనుంది.(చదవండి: జీ -మెయిల్ ఖాతాలను తొలగించనున్న గూగుల్)
సెల్ఫీ కెమెరా, ప్రధాన కెమెరా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరగానే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ ఉండనున్నట్లు సమాచారం. అయితే, ఈ మొబైల్ లో కొంచెం పెద్ద 6.55-ఇంచ్ గల ప్యానెల్ కలిగి ఉంటుంది. గత నివేదికలకు విరుద్దంగా, ఈ మొబైల్ లో 144Hz అధిక రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. వన్‌ప్లస్ 9 లోని దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో 3 సెన్సార్లు మరియు ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి, రెండు సెన్సార్లు మూడవ దాని కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయి. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్‌కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం.
పైన చెప్పిన వివరాలు టెక్ నిపుణులు తెలిపిన సమాచారం ఆధారంగా చెప్పబడినవి.
Source: OnePlus 9 CAD Render leak & 91 mobiles
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.