xiaomi_12_Series_Mobile

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం షావోమీ త్వరలో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ ఫోన్ విడుదల కాకముందే ఈ షావోమీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ స్పెషిఫికేషన్లు, ధర నెటింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. షావోమీ 12, షావోమీ 12ఎక్స్‌, షావోమీ 12 ప్రొ, షావోమీ 12 అల్ట్రా ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌లను నేడు షావోమీ చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా షావోమీ ట్రూ వైరెలెస్‌ ఇయర్‌ఫోన్స్‌(టీడబ్ల్యూఎస్‌)3 కూడా లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.

టిప్‌స్టర్‌ ఇషాన్ అగర్వాల్ రాబోయే షావోమీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ ధరలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌ ధర గత సిరీస్ 11తో పోలిస్తే కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే, ఇందులో వెనుక వైపు 3 కామెరాలు ఉంటాయి.

షావోమీ 12, షావోమీ 12ఎక్స్‌, షావోమీ 12 ప్రో ధర

  • 8జీబీ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ షావోమీ 12 ధర సుమారు చైనాలో 4,299 యువాన్లు (దాదాపు రూ. 50,500)గా ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. 8జీబీ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర 4,599 యువాన్లు (దాదాపు రూ. 54,000)గా, 12జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999(దాదాపు రూ. 58,800)గా ఉన్నట్లు వెల్లడించారు.
  • షావోమీ 12ఎక్స్‌ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లు(దాదాపు రూ. 41,100)గా, 8జీబీ + 256ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (దాదాపు రూ. 44,700)గా ఉంది.
  • షావోమీ 12 ప్రో ధరలు 8జీబీ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ 4,999 యువాన్లుగా (సుమారు రూ. 58,800)గా ఉంది. మరోవైపు, 8జీబీ + 256 ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లు (దాదాపు రూ. 62,300)గా, 12జీబీ + 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ 5,699 యువాన్లు (దాదాపు రూ. 67,000)గా ఉంది.

షావోమీ 12 ఫీచర్స్:

  • 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.28 ఇంచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే.
  • స్క్రీన్‌ ఇన్‌ బిల్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉండనుంది.
  • 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా.
  • 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్.
  • 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
  • 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
  • ఈ స్మార్ట్‌ ఫోన్‌ వైర్ లెస్ ఛార్జింగ్‌కి కూడా సపోర్ట్ చేయనుంది.