ఈ మద్య షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్ షిప్ మొబైల్ డిసెంబర్ లేదా జనవరిలో విడుదల కానునట్లు పుకార్లు వచ్చాయి. కానీ, నిర్దిష్టమైన తేదీ గురుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోన్ ని డిసెంబర్ 29న తీసుకురానునట్లు సమాచారం. ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని తీసుకొస్తునట్లు కంపెనీ సిఈఓ ప్రకటించారు. షియోమీ మొబైల్స్ లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని తీసుకొస్తున్న మొదటి మొబైల్స్ ఇదే.
ఇంకా చదవండి: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతున్న టిక్ టాక్
మొదట దీనిని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారా లేదా అన్నీ మొబైల్స్ ముందుగా చైనాలో తీసుకొచ్చినట్టే చైనాలో విడుదల చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే షియోమీ ఎంఐ 11 మొబైల్స్ లో స్నాప్‌డ్రాగన్ 888 తీసుకొస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే షియోమీ ఎంఐ 11 సిరీస్ మొబైల్స్ లో క్యూహెచ్‌డి 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను తీసుకొస్తునట్లు సమాచారం. ఈ మొబైల్ లో ప్రధాన కెమెరా సామర్ధ్యం వచ్చేసి 50 మెగాపిక్సల్ గా ఉండనుంది. 12 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ టేలిఫోటో కెమెరా తీసుకొస్తునట్లు సమాచారం. సెల్ఫీ కెమెరా విషయంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇతర లీక్‌ల ప్రకారం 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తీసుకురానున్నారు. షియోమీ ఎంఐ 11 యొక్క ధర వచ్చేసి 45000 నుండి 50000 వేల మద్య ఉండనుంది. అలాగే షియోమీ ఎంఐ 11 ధర వచ్చేసీ 60,000 నుండి 62,000 మద్య ఉండనుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.