షియోమీ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఐ 11 సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా ఇదే. దీంతో మరోసారి షియోమీ తనసత్తా చాటుకుంది. కేవలం ప్రాసెసర్ పరంగా మాత్రమే కాకుండా డిజైన్, కెమెరాలతో పాటు ఇతర స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సిరీస్ లో ‘ప్రొ’ మోడల్ ని తీసుకురావడం లేదని షియోమి తేల్చిచెప్పేసింది. అయితే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంఐ 11 మొబైల్ ను ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

ఇంకా చదవండి: లీకైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 మొబైల్ ఫీచర్స్.. ధర ఎంతంటే?

షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్స్:

డిస్‌ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.81-అంగుళాల 2కే WQHD (1,440×3,200 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లే
ర్యామ్ఎల్‌పిడీడీఆర్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్128 జీబీ, 256 జీబీ (Upto + 1 టీబీ)
ప్రాసెసర్స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
ప్రైమరీ కెమెరా108ఎంపీ(f/1.85), 13ఎంపీ(f/2.4) అల్ట్రా-వైడ్-యాంగిల్, 5ఎంపీ (f/2.4) టెలిఫోటో-మాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా20 మెగా పిక్సల్ కెమెరా
బ్యాటరీ4,600 ఎంఏహెచ్ బ్యాటరీ
బ్యాటరీ టెక్నాలజీ 55W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5
కనెక్టివిటీ5జీ, 4జీ ఎల్‌టీఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్/ఎ-జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్), యుఎస్‌బీ టైప్-సి పోర్ట్
ఇతరాలు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, హర్మాన్ కార్డాన్ స్టీరియో స్పీకర్లు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ

షియోమీ ఎంఐ 11 8 జీబీ ర్యామ్+128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,999(సుమారు రూ.45,000), 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 4,299(సుమారు రూ.48,300) మరియు టాప్-ఆఫ్-ది-లైన్ 12 జీబీ ర్యామ్+256 జిబి స్టోరేజ్ ఆప్షన్ ధర సీఎన్‌వై 4,699(సుమారు రూ.52,800). ఇది హారిజోన్ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, మిడ్‌నైట్ గ్రేలలో యాంటీ గ్లేర్ (ఎజి) ఫ్రాస్ట్ గ్లాస్ ఫినిషింగ్‌లో లభిస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here