మల్టీప్లేయర్ గేమ్ “ఫౌజీ” కోసం గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదల తేదీని, ట్రైలర్ ను గేమ్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లో షేర్ చేశారు. ఈ గేమ్ ట్రైలర్ లో పోరాట నేపథ్యంలో వచ్చే ‘ఫౌజీ గీతం’ ప్లే అవుతోంది. ఈ ట్రైలర్ ను గమనిస్తే ఒక యాక్షన్ సినిమా రేంజ్ లో రూపొందించారు. దీనిలో అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఉన్నాయి. 2021 గణతంత్ర దినోత్సవం(జనవరి 26న) సందర్భంగా ఫౌజీ గేమ్ ప్రారంభించబడుతుంది అని అక్షయ్ పేర్కొన్నారు. ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకన్ల పొడవైన వీడియోను అక్షయ్ కుమార్ షేర్ చేస్తూ .. “దేశంలో లేదా సరిహద్దులో ఉన్న ఏ సమస్య అయినా భారత సైనికులు ధైర్యంగా ఎదుర్కొంటారు. అందుకే ఈ ఫీయర్లెస్ యునైటెడ్ గార్డ్స్ యొక్క ఫౌజీ గీతాన్ని వారికి అంకితం ఇస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: వామ్మో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?
దేశ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో చైనాకు చెందిన భాగా పాపులర్ అయిన పబ్జీ గేమ్ ని నిషేదించిన వెంటనే “ఫౌజీ గేమ్” ని తీసుకొస్తునట్లు దేశీయ గేమింగ్ కంపెనీ ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ కి సంబందించిన టిజర్ ను గత ఏడాది దసరా రోజున విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ గేమ్ కోసం డిసెంబర్ నెలలో ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన 24 గంటల్లోనే ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పలు ఇంటర్వ్యూలో ఈ గేమ్ పైప్ లైన్ లో ఉందని, ఈ గేమ్ ని పబ్జీ తో పోల్చకూడదని పేర్కొన్నారు. పబ్జీ మాదిరిగా కాకుండా ఫౌజీ గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాలకు సంబందించిన ఎపిసోడ్‌లు ఉన్నాయి. జనవరి 25న రిపబ్లిక్ దినోత్సవం రోజున గేమ్ విడుదల కానుంది. యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.