ఫేస్‌బుక్ లో మరో లోపం బయటపడింది. ఈ లోపం ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత ఇమెయిల్ చిరునామా, పుట్టినరోజుల వివరాలు బహిర్గతం అవుతునట్లు ఇటీవల ఒక పరిశోదకుడు పోఖరెల్ గుర్తించారు. ఈ లోపం కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల అకౌంట్ డేటా మొత్తం బయటికి లీక్ అవుతునట్లు కనుగొన్నారు. సాదారణంగా మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు వినియోగదారుల ఇమెయిల్, చిరునామా, పుట్టినరోజులు వివరాలు వెల్లడిస్తాం. అయితే ఈ బగ్ కారణంగా ఇలాంటి సున్నితమైన సమాచారం లీక్ అవుతుందని పరిశోదకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో సైబర్ నెరగాళ్లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి: బ్రేకింగ్: పాత పద్దతిలోనే వ్యవయసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్

పోఖరెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ని పరీక్షిస్తున్న సమయంలో ఈ బగ్ తెరపైకి వచ్చింది. ఈ ఫీచర్ ని కొన్ని బిజినెస్ అకౌంట్లకు పరీక్ష దశలో భాగంగా యాక్సెస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజినెస్ అకౌంట్ల వివరాలు మాత్రమే ఈ బగ్ ద్వారా బహిర్గతం అవుతునట్లు కనుగొన్నారు. ఈ సమస్య గురుంచి ఫేస్‌బుక్ ప్రతినిది మాట్లాడుతూ.. ” బిజినెస్ అకౌంట్ల కోసం చేసిన దశలో భాగంగా పరిశోధకుడు పోఖరెల్ ఈ సమస్యను కనుగొన్నారు. బిజినెస్ అకౌంట్ల కోసం అక్టోబర్ లో నిర్వహించిన ఒక చిన్న పరీక్షలో వినియోగదారులు షేర్ చేసిన మెసేజ్ ఇతర వివరాలు బట్టబయలు అయ్యాయి. అయితే వెంటనే గుర్తించి సమస్యను పరిష్కరించాం. ఈ బగ్ ను కనుగొన్న పరిశోదకుడికి మా బగ్ బౌంటీ ప్రోగ్రాం కింద రివార్డు కూడా ఇచ్చాం’ అని చెప్పారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

Comments are closed.