జీమెయిల్‌ యూజర్లకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ను తెలిపింది. జీమెయిల్‌ మొబైల్‌ యాప్‌/వెబ్‌ యాప్స్‌ ఉపయోగించి నేరుగా గూగుల్‌ మీట్‌ యూజర్లకు వాయిస్‌, వీడియో కాల్స్‌ను చేసుకునే అవకాశాన్ని యూజర్లకు కల్పించింది. అలాగే, జీమెయిల్‌ యూజర్లు ఒకరికొకరు వాయిస్‌, వీడియో కాలింగ్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్గించనుంది. భవిష్యత్తులో ఇంటర్నెట్‌ వాయిస్‌ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్‌ అందుబాటులోకి తీసుకొని రానుంది. జీమెయిల్‌ యాప్స్‌లో గ్రూప్‌ చాట్‌ సేవలను కూడా యూజర్లు పొందే అవకాశాన్ని గూగుల్‌ అందించనుంది.(చదవండి: ఐపీఎల్‌లో పది సెకన్ల యాడ్‌కి ఎంత చెల్లిస్తారో తెలుసా?)

గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్‌ యాప్స్‌లో చాట్, స్పేసెస్‌, గూగుల్‌ మీట్‌ వంటి మూడు ట్యాబ్‌లను వర్క్‌స్పేస్ టూల్స్‌కు మరింతగా అనుసంధానంగా ఉండనున్నాయి. గూగుల్‌ మీట్‌ బటన్‌పై క్లిక్‌ చేసిన తర్వాత జనరేట్‌ అయిన లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్‌ను చేయవచ్చు. ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్‌ ఖాతాదారులు గూగుల్‌ మీట్‌ పాల్గొనే సదుపాయం కల్గనుంది. తాజాగా గూగుల్‌ మీట్‌ కంపానియన్‌ మోడ్‌ను వచ్చే నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్‌ ప్రయత్నిస్తుంది. గూగుల్‌ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్‌, స్లయిడ్‌లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్‌ సహకారంతో టీమ్‌ మీటింగ్‌లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here