పబ్‌జీ అభిమానులకు శుభవార్త. త్వరలోనే ఈ గేమ్‌ని కొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్‌ పేరుతో భారత్‌లో విడుదల చేయనున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. అంటే గేమర్స్‌ పబ్‌జీలో ఇకపై కొత్త లుక్‌లో చికెన్‌ డిన్నర్‌ చేయొచ్చన్నమాట. ప్రపంచంలో భాగా గుర్తింపు పొందిన పబ్‌జీ భారతదేశం నుండి తొలిగించిన తర్వాత వాటి యొక్క డౌన్లోడ్ లు చాలా వరకు తగ్గాయి. అయితే, తాజాగా ఇండియాలో PUBG మొబైల్ ఇండియా పేరుతో తిరిగి భారత్ లోకి తీసుకువస్తునట్లు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. ముఖ్యంగా, PUBG మొబైల్ ఇండియా అనేది ప్రత్యేకంగా భారతీయ గేమర్స్ కోసం తయారు చేస్తునట్లు తెలిపారు.

‘‘పబ్‌జీ ఈస్పోర్ట్స్‌కి సంబంధించి భారత్‌లో వస్తున్న స్పందనకు ధన్యవాదాలు. మా కంపెనీ ద్వారా భారత్‌లో ఈ-స్పోర్ట్స్‌కి సంబంధించి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా కొత్తగా వంద మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం’’ అని పబ్‌జీ కార్పొరేషన్‌ వెల్లడించింది. అయితే భారత మార్కెట్‌ కోసం కొత్తగా రూపొందించిన గేమ్‌ను ఎప్పుడు తీసుకొస్తున్నారనే దానిపై పబ్‌జీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలానే భారత్‌లో గేమర్స్‌ గోప్యత, భద్రత డేటాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. తాజాగా మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుని తిరిగి పబ్‌జీని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు క్రాఫ్టన్‌ తెలిపింది. గతంలో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్‌సెక్యూరిటీ ఆరోపణలతో కేంద్రం పబ్‌జీతో సహా చైనాకు చెందిన 117 యాప్‌లపై నిషేధం విధించింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.