ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వారు నచ్చిన తీసుకొని ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని గూగుల్‌ ఫొటోస్‌లోకి అప్‌లోడ్‌ చేసేస్తున్నాం. కానీ జూన్‌ 1 నుంచి మీకు ఈ అదృష్టం ఉండదు. ఎందుకంటే గూగుల్‌ ఫొటోస్‌లో హై క్వాలిటీ ఫొటోల అపరిమిత స్టోరేజీని నిలిపివేస్తుంది. దీంతో మనం ఎంత వాడుకోవాలన్నా గూగుల్ అందించే 15 జీబీ లోపే వాడుకోవాలి. ఆపై స్టోరేజీ కావాలంటే ఇక నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిందే. దీనికేం చేయాలి, మరీ తీయలేనంత స్టోరేజీ ఉంటే ఏం చేయాలి!.(ఇది కూడా చదవండి: కొత్తగా హోమ్​ లోన్ తీసుకునేవారు ముందు ఇవి తెలుసుకోండి?​)

గూగుల్‌ స్టోరేజీలో అనవసరమైన ఫొటోలు/ వీడియోలు/ఫైల్స్‌ సులభంగానే డిలీట్‌ చేసేయొచ్చు. దీని కోసం మీ మొబైల్‌లో గూగుల్‌ వన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆ యాప్‌లోని హోం పేజీలో స్టోరేజీ బాక్స్‌ ఉంటుంది. మొత్తంగా గూగుల్‌ ఇచ్చే ఉచిత 15 జీబీ స్టోరేజీలో మీరు ఎంత వాడారనేది అందులో కనిపిస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ ఎంతంతెంత స్టోరేజీ వాడింది అక్కడ ఉంటుంది. దాని కింద ఫ్రీ అప్‌ స్టోరేజీ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే గూగుల్‌ స్టోరేజీలో ఉన్న ఫైల్స్‌/వీడియోస్‌/ఫొటోలు‌ మీకు కనిపిస్తాయి. అలా కనిపించిన వాటిలో మీకు నచ్చని వాటిని సెలక్ట్‌ చేసుకొని బల్క్‌గా డిలీట్‌ చేసేయొచ్చు. ఒకవేళ ఫ్రీఅప్‌ స్టోరేజీ కనిపించకపోతే స్టోరేజీ బ్లాక్‌లో చూపించే డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ పేర్లను క్లిక్‌ చేసి.. ఆయా సర్వీసులోకి వెళ్లి డిలీట్‌ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలి అంటే కొనుక్కునే అవకాశం ఉంటుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here