Whatsapp Security

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో కొన్ని బలహీనతలున్నాయని, వీటి వల్ల యూజర్ల సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని దేశ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆరటీ- ఇన్‌) హెచ్చరించింది. ఈ మేరకు వాట్సప్‌పై ‘అధిక ప్రమాద’ రేటింగ్‌ అడ్వైజరీని జారీ చేసింది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ 2.21.32 వెర్షన్‌కు ముందరి వెర్షన్లు సాఫ్ట్‌వేర్లలో బలహీనతలు కనుగొన్నామని ప్రకటించింది.

సాఫ్ట్‌వేర్‌లోని ఈ బహుశ బలహీనతలు యూజర్ల సమాచార భద్రతకు ప్రమాదం కలిగిస్తాయని వివరించింది. వాట్సాప్‌ యాప్‌లోని కాచే కాన్సిగరేషన్‌ సమస్య వల్ల ఈ బలహీనతలు తలెత్తినట్లు తెలిపింది. వాట్సాప్‌ వినియోగిస్తున్న యూజర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని కొత్త యూజర్లు లేటెస్టు వెర్షన్‌నే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.