నగదు రహిత లావాదేవీలు, డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) సేవలకు అనుమతిస్తుంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఎన్‌పీసీఐ (ఎన్‌పీసీఐ) అనుమతించింది. దీంతో వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా నగదు చెల్లింపులు చేసేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని 140 బ్యాంకు ఖాతాల ద్వారా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అలానే పది ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ చెల్లింపులు ప్రారంభించడానికి మీరు Android లేదా iOS కోసం వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌లో ఉండాలి. మీ వాట్సాప్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉండాలి. వాట్సాప్ చెల్లింపుల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

వాట్సాప్ చెల్లింపుల కోసం ఎలా సెటప్ చేయాలి?

1) వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే పేమెంట్స్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే న్యూ పేమెంట్, యాడ్‌ న్యూ పేమెంట్ మెథడ్‌ అని రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
2) వాటిలో యాడ్ న్యూ పేమెంట్‌ మెథడ్‌పై క్లిక్‌ చేస్తే యాక్సెప్ట్‌ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే మీకు బ్యాంకుల జాబితా కనిపిస్తుంది.
3) అందులో మీ ఖాతా ఉన్న బ్యాంక్‌ సెలెక్ట్ చేస్తే ఎస్సెమ్మెస్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేయమని అడుగుతుంది. దాని ఓకే చేసి మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేయాలి.
4) తర్వాత నుంచి మీరు వాట్సాప్‌లో నగదు చెల్లింపులు చెయ్యొచ్చు.

వాట్సాప్ పే: చెల్లింపులు ఎలా చేయాలి

1) వాట్సాప్ చాట్ తెరిచి అటాచ్మెంట్ చిహ్నాన్ని నొక్కండి.
2) చెల్లింపును నొక్కండి > కావలసిన మొత్తాన్ని టైప్ చేయండి> ఎంటర్ నొక్కండి.
3) చెల్లింపును పూర్తి చేయడానికి మీ యుపిఐ పిన్ను నమోదు చేయండి.

గమనిక: మీరు పంపాలని అనుకున్నా వ్యక్తి కూడా ఈ తన వాట్సప్ నెంబర్ కి బ్యాంక్ ని లింకు చేయాల్సి ఉంటుంది. ఫోన్‌పే లేదా గూగుల్ పే వంటి యూజర్లకు కూడా ఇలానే డబ్బులు పంపవచ్చు. కానీ వారికి మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా UPI ID ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here