కేంద్రం ప్రభుత్వం మరోసారి చైనాకు చెందిన యాప్‌లపై కొరడా ఝళిపించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై కేంద్రం శాశ్వత నిషేధం విధించినట్టు తెలుస్తుంది. ఈ జాబితాలో బైట్‌డాన్స్ కు చెందిన టిక్‌టాక్, బైడు, వీచాట్, అలీబాబా యుసి బ్రౌజర్, షాపింగ్ యాప్ క్లబ్ ఫ్యాక్టరీ, మీ వీడియో కాల్, బిగో లైఫ్ వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. గత ఏడాది జూన్ చివరి నుంచి ఇప్పటివరకు మొత్తం 267 యాప్‌లను(వివిధ దశలలో) ప్రభుత్వం భద్రతపరమైన చర్యలో భాగంగా తాత్కాలికంగా నిషేదం విధించింది. ఇప్పుడు అందులో టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లను శాశ్వతంగా నిషేధం విధించాలని యోచిస్తుంది. (ఇంకా చదవండి: 50 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాక్.. అందులో మీరు ఉన్నారా?)

భారత వినియోగదారుల డేటా సేకరణ, డేటా ప్రాసెసింగ్ పద్ధతులతో పాటు డేటా భద్రత, గోప్యతపై ప్రభుత్వం అడిగిన కొన్ని ప్రశ్నలకు కంపెనీల సరైన విధంగా స్పందించకపోవడంతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఈ 59 యాప్‌లపై శాశ్వత నిషేధం విధించాలని యోచిస్తున్నారు. భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేక‌రించి దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లపై ఆయా సంస్థల వివరణను కేంద్రం కోరింది. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది.

గత వారం శాశ్వత నిషేధంపై కంపెనీలకు వ్యక్తిగత ప్రాతిపదికన నోటీసు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. షియోమి ప్రతినిధి మాట్లాడుతూ.. “ఎంఐ ఇండియా అన్ని ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉంది. ఇంకా చట్టాలకు లోబడి మరిన్ని మార్పులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు” పేర్కొన్నారు. తాజాగా మరోసారి చైనా అక్రమంగా ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన “నాకు లా” ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో చొరబడగా భారత్, చైనా సైనికుల మధ్య గతవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రెండు దేశల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. (ఇంకా చదవండి: ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here